Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup: రెండు సెమీస్ లూ వర్షార్పణం అయితే ఫైనల్ కు వెళ్లేదెవరు ?

టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సెమీస్ దశకు చేరుకుంది. బుధవారం తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా న్యూజీలాండ్ తో తలపడనుండగా.. గురువారం రెండో సెమీ పైనల్లో భారత్.. ఇంగ్లాండ్ ను ఎదుర్కోనుంది. ఈ రెండు మ్యాచ్ లకూ వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే వరల్డ్ కప్ లో పలు సంచలనాలు నమోదైన నేపథ్యంలో ఈ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో రేపు దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్ అయినా, ఎల్లుండి భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ అయినా వర్షం కారణంగా ఆలస్యమైతే అదే రోజు 90 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. ఇంకా వర్షం పడుతుంటే మ్యాచ్ ఫలితం తేల్చేందుకు తర్వాతి రోజు అంటే రిజర్వుడేలో 120 నిమిషాల అదనపు సమయం ఇరుజట్లకూ ఇస్తారు. తద్వారా తద్వారా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగేలా చూసుకోవచ్చు.

T20 World Cup Who Qualifies for the Final if Both Semis are Washed Out

అయితే అలా కూడా రెండు సెమీ పైనల్ మ్యాచ్ లూ వర్షం కారణంగా అస్సలు నిర్వహించే పరిస్ధితి లేకుండా పోతే అప్పుడు ఫైనల్ బెర్తుల్ని ఖరారు చేసేందుకు ఐసీసీ మరో నిబంధన పెట్టింది. అదే గ్రూప్ స్టేజిలో ఆయా జట్ల స్ధానాల ఆధారంగా నిర్ణయం. ఈ నిబంధన ప్రకారం దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ మధ్య సెమీ ఫైనల్ వర్షార్పణం అయితే ఈ రెండు జట్లలో గ్రూప్ దశలో టాప్ లో నిలిచిన దక్షిణాఫ్రికా ఆటోమేటిగ్గా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అలాగే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా నిర్వహించలేకపోతే గ్రూప్ దశలో టాప్ లో నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుతుంది. అలా రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లూ జరగకపోతే ఫైనల్ కు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ చేరతాయన్నమాట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+