ఇంగ్లండ్ వన్డేల తర్వాత టీమిండియా కోచ్ రాజీనామా ..! బీసీసీఐకి సమాచారం..!

టీమిండియాకు (Team India) యూకే టూర్ లో వరుసగా రెండు టీ20 సిరీస్ ల్లో ఓటమి ఎదురైంది. ఐర్లాండ్ లో 0-2, ఇంగ్లండ్ తో 0-4 తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులు చోటు చేసుకోవడం సంగతి అంటుంచి జట్టు మేనేజ్ మెంట్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ప్రారంభం కావడంతో, ఇది ముగిశాక జట్టు కోచ్ రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందింది.

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతం గంభీర్ కు సహాయ కోచ్ (Assistant Coach) గా ఉన్న ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నాడు. యూకే టూర్ లో రెండు టీ20 సిరీస్ లు కోల్పోవడంతో స్టాప్ లో భారీ మార్పులు చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే డస్కటే ను సాగనంపుతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుమతి లభిస్తే, జట్టుతో ఇది ఆయనకు చివరి వారం కావచ్చునని క్రిక్ బజ్ ఓ కథనంలో తెలిపింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే చివరి వన్డే మ్యాచ్‌తో టీమిండియాతో ఆయన అనుబంధం ముగిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Team India Coach Set to Resign After England ODI Series Report

అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే తన నిర్ణయాన్ని టెన్ డస్కటే బీసీసీఐకి తెలియజేశాడు. అయితే ఆయన నిర్ణయానికి ఉద్యోగ అసంతృప్తి కారణం కాదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం డస్కటే టీమిండియా కోచింగ్ సిబ్బందిలో చేరారు. ఇప్పుడు రెండేళ్లు ముగియడంతో బోర్డుతో తన ఒప్పందాన్ని పూర్తి చేసుకున్నట్లు భావిస్తున్నారు. డస్కటే పదవీకాలం జూలై 12-14 తేదీల మధ్య ముగిసింది. టెన్ డస్కటే వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని, లండన్‌లో ఉన్న తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారని బోర్డు వర్గాలు చెప్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే బోర్డుకు గతంలో డస్కటే పేరును సిఫార్సు చేశాడు. ఇప్పుడు తిరిగి గంభీరే సాగనంపుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+