IND Vs AUS: సెంచరీతో రెచ్చిపోయిన విరాట్.. భారీ స్కోర్ చేసిన ఇండియా..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్ట్ లో టిమిండియా పటిష్ట స్థితిలోకి చేరింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే అలౌట్ అయింది. నితిశ్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా.. పంత్ 37 పరుగులు చేశాడు. రాహుల్ 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజీల్ వుడ్ 4 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 104 పరుగులకే అలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 26 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ 21 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా 3, సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో పుంజుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 77 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ జైస్వాల్ మంచి సహకారం అందించాడు.

ఈ క్రమంలో25 పరుగులు చేసిన పడిక్కల్ హెజీల్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, జైస్వాల్ కంగారులను కంగారు పెట్టించారు. వీలైనప్పుడల్లా పరుగులు చేశారు. ఈ క్రమంలో 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్ లు కొట్టిన యశస్వి జైస్వాల్ మిచెల్ మార్ష్ బౌలింగ్ లో షాట్ ట్రై చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వెళ్లగా.. స్టంప్ ఔట్ అయ్యాడు. పంత్ ఒకే పరుగు చేశాడు.
ధృవ్ జురెల్ కూడా ఒక పరుగు చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కోహ్లీకి సహకరిస్తూ వచ్చాడు. 29 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ లయన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నితిష్ రెడ్డి దాటిగా ఆడాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ వెంటనే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.












Click it and Unblock the Notifications