టీమిండియా ముందున్న టఫ్ సిరీస్
భారత టీ20 క్రికెట్ జట్టులో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టులో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సెలక్షన్ కమిటీ.. టీ20 సారథ్య బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించింది. అతని నాయకత్వంలో టీమిండియా తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. అతను వైస్ కేప్టెన్ సెలెక్ట్ అయ్యాడు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకీ ఈ జట్టులో చోటు దక్కింది. మొదటిసారిగా అతను టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా గేమ్స్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ నిర్ణయం ద్వారా భారత క్రికెట్ బోర్డు నూతన శకానికి నాంది పలుకింది. ముంబైలో జరిగిన కీలక సమావేశం అనంతరం, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం జట్లను ఖరారు చేసింది. టీ20 జట్టు నుండి సూర్యకుమార్ యాదవ్ ను తప్పించారు సెలెక్టర్లు. ఇది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా జట్టులో చోటు కూడా దక్కలేదతనికి.

భారత జట్టు జూన్ చివరలో ఐర్లాండ్ పర్యటనతో అంతర్జాతీయ సమరానికి సిద్ధమవుతుంది. బెల్‌ఫాస్ట్‌లో జూన్ 26, 28న రెండు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటన ప్రారంభమవుతుంది. జూలై 1న చెస్టర్ లే స్ట్రీట్‌లో మొదటి టీ20 మొదలై, జూలై 11న సౌతాంప్టన్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత జూలై 14 నుంచి బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లండన్ (లార్డ్స్) వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైన జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఆసియా క్రీడల కోసం జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.
టీ20 సిరీస్ వివరాలు
మొదట అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతోనే ఈ పర్యటన మొదలవుతుంది.
| మ్యాచ్ | తేదీ | వేదిక |
|---|---|---|
| మొదటి టీ20 | జూలై 1 | చెస్టర్-లీ-స్ట్రీట్ |
| రెండో టీ20 | జూలై 4 | మాంచెస్టర్ |
| మూడో టీ20 | జూలై 7 | నాటింగ్హామ్ |
| నాలుగో టీ20 | జూలై 9 | బ్రిస్టల్ |
| ఐదో టీ20 | జూలై 11 | సౌతాంప్టన్ |
వన్డే సిరీస్ వివరాలు
టీ20 సిరీస్ తర్వాత వన్డే మ్యాచ్‌లు మొదలవుతాయి.
| మ్యాచ్ | తేదీ | వేదిక |
|---|---|---|
| మొదటి వన్డే | జూలై 14 | బర్మింగ్‌హామ్ |
| రెండో వన్డే | జూలై 16 | కార్డిఫ్ |
| మూడో వన్డే | జూలై 19 | లండన్ (లార్డ్స్) |












Click it and Unblock the Notifications