Team India: వెస్టిండీస్ లో తుఫాన్.. బార్బడోస్ లో చిక్కుకున్న టీమిండియా.. !
టీమిండియా చాలా రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. భారత్ 2007లో మొదటిసారి టీ20 వరల్డ్ కప్ గెలువగా.. ఇప్పుడు రోహిత్ నాయకత్వంలో రెండోసారి టీ20 వరల్డ్ కప్ సాధించింది. బార్బడోస్ లో జరిగిన ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు అక్కడే ఉండాల్సి వచ్చింది. వెస్టిండీస్ లో బెరిల్ హరికేన్ ఉద్భవించింది.
దీని కారణంగా టీమిండియా బార్బడోస్ లో చిక్కుకుపోయింది. హరికేన్ కారణంగా అవుట్‌బౌండ్ విమానాలన్నీ రద్దు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విమానాశ్రయంతో పాటు బార్బడోస్‌లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. బార్బడోస్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ కొనసాగుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. హోటళ్లల్లో ఉన్న భారత క్రికెటర్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వారికి కోరుకున్న సౌకర్యాలు అందడం లేదని వార్తలు వస్తున్నాయి.

భారత జట్టు ఉంటున్న హోటల్ లో చాలా తక్కువ మంది సిబ్బందితో పని చేస్తున్నట్లు సమాచారం. భారత జట్టు జూలై 1న భారత్ బయలుదేరాల్సి ఉంది. కాని హరికేన్ కారణంగా వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. సోమవారం (జూలై 1) మధ్యాహ్నం వరకు విమానాశ్రయం మూసివేసి వేసినట్లు వార్తలు వస్తున్నాయి. హరికేన్ తగ్గిన తర్వాత విమానాలు నడిచే అవకాశం ఉంది. భారత జట్టు క్షేమంగా ఇండియాకు చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications