టీమిండియా 9 మందితోనే ఆడుతోంది.. ఈ మాటంటే రోకో అభిమానులు ఓర్చుకోలేరు: సీవీ ఆనంద్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో రెండింటిలో ఓటమిని చవి చూసింది. ఐదో టెస్టులో టీమిండియా ప్రదర్శనపై ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో సీనియర్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చిన విషయం తెలిసిందే.

సీనియర్ ఆటగాళ్లు రాణించకపోవడంతో క్రికెట్ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. దీంతో కొన్నింటికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానాలు ఇచ్చారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Team India is playing with only 9 players CP CV Anand on Border-Gavaskar Trophy

ప్రత్యర్థి జట్టు 11 మందితో ఆడుతుంటే భారత జట్టు 9 మందితో ఆడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో మరో ఇద్దరు ఉన్నా.. లేనట్టే అని ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు. సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో పూర్తిగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. దీంతో వారినుద్దేశించే సీపీ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటంటే వారి అభిమానులకు కోపం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వారి సోషల్ మీడియా ఆర్మీలు వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతాయన్నారు.

ప్రతిభావంతులైన సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో టీమిండియా బలంగానే కనిపించినప్పటికీ.. సీనియర్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో విఫలం కావడంతో వరుసగా రెండు ఓటములను చవిచూడాల్సి వచ్చింది. గత ఆసీస్ పర్యటనలో కుర్రాళ్లతో టీమిండియా విజయం సాధిస్తే.. ఇప్పుడు మత్రం పేలవమైన ప్రదర్శనతో సిరీస్ కోల్పోయే స్థితిలో ఉందని సీపీ అన్నారు. ఓ క్రికెట్ అభిమానిగా ఈ ఓటములను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు.

టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా ఉన్నవారు జట్టుకు అవసరమైన సమయంలో మంచి ప్రదర్శన చేసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కాగా, రోహిత్ శర్మ, విరాట కోహ్లీ ఈ నాలుగు టెస్టుల్లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చకపోవడం గమనార్హం. ఓ వైపు యువ ఆటగాళ్లు, బౌలర్లు రాణిస్తున్నప్పటికీ.. కీలకంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్ల పేలవ ప్రదర్శన జట్టుకు ఓటమి కారణమవుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+