మొన్నే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు..అప్పుడే ఫొటోలు డిలీట్ చేశాడు
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫొటోను డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తారు. అయితే, కుల్దీప్ తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను పోస్ట్ చేసిన కొన్ని గంటలకే తొలగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
జూన్ 4న తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో నిశ్చితార్థం చేసుకున్న కుల్దీప్, ఈ శుభవార్తను తెలియజేస్తూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. అభిమానులు, క్రికెటర్లు, సినీ ప్రముఖులు అతనికి అభినందనలు తెలిపారు. అయితే, ఆశ్చర్యకరంగా, కొన్ని గంటల తర్వాత ఆ ఫొటోను కుల్దీప్ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి పూర్తిగా తొలగించారు.

ఈ చర్యపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కొందరు నెటిజన్లు "భాభి గుస్సా హుయ్ క్యా?" (వదినగారు కోపడ్డారా?) అంటూ సరదాగా కామెంట్లు చేయగా, మరికొందరు వారిద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చిందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొందరు, ఇది కుటుంబ సభ్యుల కోరిక మేరకు లేదా గోప్యతను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయమై ఉండొచ్చని అభిప్రప్రాయపడ్డారు.
కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో లక్నోలో జరిగింది. త్వరలో ఇంగ్లాండ్ టెస్ట్ టూర్‌కు వెళ్లనున్న కుల్దీప్, ఈ పర్యటన తర్వాత నవంబర్‌లో వివాహం చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఫోటో డిలీట్ వెనుక అసలు కారణం ఏమిటనేది మాత్రం కుల్దీప్ యాదవ్ స్పష్టం చేయలేదు, అది ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది.












Click it and Unblock the Notifications