ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు..58 తర్వాత గ్రాండ్ విక్టరీ

ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి టెస్టులో విజయం అంచుల దాకా వచ్చి ఓటమి పాలైన టీమిండియా, రెండో టెస్టులో మాత్రం పట్టుదలను ప్రదర్శించి అద్భుత విజయాన్ని అందుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో, 58 ఏళ్ల తర్వాత భారత్ టెస్టు గెలవడం విశేషం. ఈ విజయం సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

భారత్ ఆధిపత్యం
బ్యాట్స్‌మెన్‌లు భారీ స్కోరు సాధించి పునాది వేయగా, బౌలర్‌లు దాన్ని ఘన విజయంగా మలిచారు. 608 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్, ఓవర్‌నైట్ స్కోరు 72/3 తో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభమైన కాసేపటికే ఒలీ పోప్, హ్యారీ బ్రూక్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేయగా, లంచ్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ పెవిలియన్ చేరాడు.

Team India wins Birmingham Test with a landslide victory

ఆకాష్ దీప్ మ్యాజిక్
రెండో సెషన్‌లోనే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 271 పరుగులకే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జెమీ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి మిగతావారు నిలబడలేకపోయారు. ముఖ్యంగా, బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్, తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా 6 వికెట్లు పడగొట్టి హీరోగా నిలిచాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం అయింది. దీంతో సిరీస్ ఉత్కంఠభరితంగా మారగా, మూడో టెస్టు జులై 10 నుంచి ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+