Nithish Kumar Reddy: ఆస్ట్రేలియాతో సిరీస్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు..
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతనికి ఇది తొలి టెస్ట్ సిరీస్ అయినా ఏ మాత్రం భయం లేకుండా ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఓడిపోయినప్పటికీ నితిశ్ రెడ్డి ఆట అందరిని ఆకట్టుకుంది. అతను ఈ సిరీస్ లో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతున్నాడు. అతని ఆట చూసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి టెస్ట్ లో నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు.
మొదటి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 295 పరుగుల తేడాతో గెలిచింది. కానీ పింక్ బాల్ టెస్ట్ ఇండియా తేలిపోయింది. 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు. 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

రెండు టెస్టుల్లో కూడా నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. అయితే అతను తన స్కోర్ ను భారీ స్కోర్ గా మార్చలేకపోయాడు. హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. అయితే అతని మంచి భవిష్యత్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అతను ఇంకా తన ఆటను మెరుగుపరుచకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై నితీశ్ కుమార్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఇది ప్రతి ఆటగాడికి అవసరమని వివరించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నితీశ్ రెండో స్థానంలో ఉన్నాడు.
యశ్వసి జైస్వాల్ రెండు టెస్టుల్లో 185 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి 163 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి బ్యాట్ తోనే కాకుండా బాల్ తోనూ తన వంతు సహకారం అందిస్తున్నాడు. అతను మొదటి టెస్ట్ లో ఒక వికెట్ తీయగా.. రెండో టెస్ట్ లో కూడా ఒక వికెట్ పడగొట్టాడు. అతడు నిలకడా రాణిస్తూ ఉంటే టీమిండియాకు ఆల్ రౌండర్ మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications