విరాట్, రోహిత్ కి ఇక ఛాన్స్ లేదా - 2027 ప్రపంచ కప్ సరికొత్తగా..!!
2023 ప్రపంచ కప్ ముగిసింది. కప్ టీమిండియా గెలుస్తుందనే ఆశలు ఫైనల్స్ లో అడియాశలయ్యాయి. కానీ, ఈ టోర్నీలో టీమిండియా ఆట తీరును ప్రత్యర్ధి టీంలు సైతం ప్రశంసిస్తున్నాయి. ఫైనల్స్ లో ఓడి కోట్లాది మందిని నిరాశకు గురి చేసినా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ టీం ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక, మరో నాలుగేళ్లల్లో మరో ప్రపంచ కప్ జరగనుంది. కానీ, ఆ కప్ లో విరాట్ - రోహిత్ ఆడుతారా. క్రికెట్ నిపుణులు ఏం చెబుతున్నారు. 2027 లో ఆడే జట్లు కూడా ఖరారయ్యాయి.
ఆ ఇద్దరికీ ఇదే చివరిదా:టీం ఇండియా హీరోలు రోహిత్ - విరాట్ కు 2023 చివరి ప్రపంచ కప్ గా నిలిచిందా. 2027లోనూ ఈ ఇద్దరు ఆడుతారా. తాజా ఫైనల్స్ లో టీం ఇండియా ఓడటం..ఆ ఇద్దరూ కన్నీరు పెట్టటం కోట్లాది మంది ఫ్యాన్స్ ను కదిలించింది. రికార్డుల హోరు తో దేశంలోనే కాకుండా ప్రత్యర్ది దేశాల్లోనూ ఈ ఇద్దరు అభిమానులను సంపాదించుకున్నారు. 2011 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంలో సచిన్ ను తన భుజాల మీద మోసిన కోహ్లీని ఈ ప్రపంచ కప్ లో గెలిస్తే గిల్ తన భుజాల పైన మోయాలని సీనియర్ క్రికెటర్లు ఆకాంక్షించారు. కానీ, ఫలితం మారింది. ప్రస్తుతం రోహిత్ వయసు 36, కోహ్లీ వయసు 35. 2027 ప్రపంచ కప్ కు ఈ ఇద్దరి వయసు మరో నాలుగేళ్లు పెరుగుతుంది. కానీ, ఇద్దరి ఫిట్ నెస్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు.

మరో నాలుగేళ్ల నిరీక్షణ:విరాట్ వచ్చే ప్రపంచ కప్ సమయానికి 39 ఏళ్లకు చేరినా..ఖచ్చితంగా ఆడుతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. సచిన్ తన 40వ ఏట వరకు ఆడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. కోహ్లీ బద్దలు చేయాల్సిన రికార్డులు చాలా ఉన్నాయని..ఈ ఫైనల్స్ లో ఓడినా..ఆ ఓటమి విరాట్ శక్తిని తగ్గించలేదంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ గురించి చర్చ సాగుతోంది. ఈ ప్రపంచ కప్ లో రోహిత్ నాయతక్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. యువ ఆటగాళ్లు పోటీ పడి టీం ఇండియాలో ఛాన్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ధోనీ నాయకత్వంలో ప్రపంచ కప్, టీ 20 లో టీమిండియా ప్రపంచ విజేతలుగా నిలిచింది. 2023లో ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక, ఇప్పుడు ఈ ఘనత కోసం పోటీ పడాలంటే మరో నాలుగేళ్లు నిరీక్షించాలి.
ఈ సాని 14 జట్లతో:ఇక, 2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి నిర్వహించనున్నాయి. ఈ సారి జట్ల సంఖ్య 14కు పెరుగుతంది. మ్యాచ్ ల సంఖ్య 54గా నిర్ణయించారు. వచ్చే ప్రపంచ కప్ లో 14 జట్లను ఏడేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో ఒక్కో జట్లు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూపులలో తొలి మూడుస్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ కు అర్హత సాధిస్తాయి. అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్ చేరుతాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ లో తలపడతాయి. వన్డే ర్యాంకింగ్స్ లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ప్రపంచ కప్ ఆడుతాయి. అయితే, 2023 ప్రపంచ కప్ ఓడినా..ఇక టీం ఇండియా ఇప్పుడు ఆసీస్, సౌతాఫ్రికాతో సిరీస్ కు సిద్దం అవుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications