హ్యాండ్‌షేక్ వివాదం: బంగ్లా బోర్డు సంచలన పోస్ట్!

U19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పోరు కేవలం ఆటతోనే కాకుండా వివాదంతోనూ వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా చేసుకోకపోవడం పెను దుమారం రేపింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

అసలేం జరిగిందంటే?
జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీమ్ అనారోగ్యం కారణంగా టాస్‌కు రాలేకపోయాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్‌కు వచ్చాడు. టాస్ ప్రక్రియ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లా కెప్టెన్ జవాద్ ఒకరితో ఒకరు చేతులు కలపకుండానే నేరుగా బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడటానికి వెళ్లిపోయారు.కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు చూసిన క్రికెట్ అభిమానులు, ఇరు జట్ల మధ్య క్రీడా స్ఫూర్తి లోపించిందని మండిపడ్డారు.

U19 World Cup 2026 Handshake Controversy Erupts as Bangladesh Board Issues Clarification

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వివరణ
ఈ వివాదంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని స్పష్టం చేసింది. "భారత్, బంగ్లాదేశ్ కెప్టెన్ల మధ్య కరచాలనం జరగకపోవడం పూర్తిగా ఒక పొరపాటు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కేవలం ఏకాగ్రత లోపించడం వల్లే ఆ క్షణంలో అలా జరిగింది తప్ప, ప్రత్యర్థి జట్టును గౌరవించకూడదనే ఉద్దేశం మాకు లేదు. క్రీడా విలువలను కాపాడటంలో బంగ్లాదేశ్ ఎప్పుడూ ముందుంటుంది." అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు?
గతంలోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మైదానంలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి రాజకీయ పరిణామాలు కూడా దీనిపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రీడా మైదానంలో కూడా ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది.

గతంలోనూ ఇలాంటి ఘటనలే..
2025 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ కెప్టెన్లు కూడా ఇలాగే హ్యాండ్‌షేక్ చేసుకోలేదు.మహిళల ప్రపంచకప్, అండర్-19 ఆసియా కప్‌లలోనూ ఇరు జట్ల మధ్య ఇలాంటి ప్రవర్తనే కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+