బ్యాటింగ్‌కు నో ఛాన్స్.. బాటిల్‌కు ఫుల్ డ్యూటీ!
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు తుది జట్టులో బీహార్‌కు చెందిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా యాజమాన్యం ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని.. ప్రతీదీ ముందే నిర్ణయించబడి జరుగుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. యువ ఆటగాళ్లను నిరంతరం బెంచ్ కే పరిమితం చేస్తే వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
బెంచ్‌పై కోర్చుబెడితే ఆటగాళ్లు తయారవ్వరు: కోచ్ ఆవేదన
వైభవ్ సూర్యవంశీ వంటి అత్యంత ప్రతిభావంతుడైన యంగ్ బ్యాటర్‌కు తుదిజట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడాన్ని మనీష్ ఓఝా తప్పపట్టారు. "ఓ యువ ప్లేయర్ తన లోపాలను సరిదిద్దుకుని, అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకోవాలంటే అతనికి స్టేడియంలో ఆడే అవకాశం ఇవ్వాలి. నీళ్లు అందిస్తూ డగౌట్లోనే కూర్చోబెడితే ఎవరూ గొప్ప ఆటగాళ్లు కాలేరు" అని మనీష్ ఓఝూ అభిప్రాయపడ్డారు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిన 19 మ్యాచ్‌లలో 11 మ్యాచ్‌లకు వైభవ్ దూరంగానే ఉండిపోయారని, అసలు అతనికి అవకాశం ఇవ్వకూడదని జట్టు యాజమాన్యం ముందే ఫిక్స్ అయిందా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

మోర్నే మోర్కెల్ కామెంట్స్.. ఓఝా కౌంటర్
వెస్టిండీస్ జట్టుతో సిరీస్ ప్రారంభానికి ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోయినా.. రోహిత్, విరాట్ వంటి సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్, బస్సు, డగౌట్లో సమయం గడపడం వల్ల అతనికి ఎంతో అనుభవం వస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మనీష్ ఓఝా తీవ్రంగా విభేదించారు. సీనియర్ల అనుభవం ఉపయోగపడే మాటే అయినప్పటికీ.. పదేపదే జట్టులో చోటు దక్కకపోతే జట్టుకు నా అవసరం లేదనే నిరాశ ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుందని, ఇది ఆటగాడి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిరీస్ స్థితిగతులు, తదుపరి మ్యాచ్‌లు
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఇండోర్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు అక్టోబర్ 14, 17 తేదీల్లో వరుసగా హైదరాబాద్, బెంగళూరులలో జరగనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టీ20లోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
