IND vs WI 4th T20: హైదరాబాద్ వేదికగా నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే!

IND vs WI 4th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. నాలుగో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 14 బుధవారం నాడు హైదరబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉండగా.. వెస్టిండీస్ జట్టు సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!
IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు లేనట్లే!
భారత ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ స్థానాలు దాదాపు ఖాయమయ్యాయి. ఇండోర్ మ్యాచ్‌లో సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఔటైనప్పటికీ.. అంతకుముందు రాంచీలో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అంతే కాకుండా సంజు శాంసన్‌కు హైదరాబాద్ స్టేడియం అత్యంత ఇష్టమైన స్టేడియాల్లో ఒకటి. ఇక్కడ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సంజు శాంసన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ కూడా సాధించాడు. మూడో నంబర్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానున్నారు.

IND vs WI 4th T20 Playing 11 India Predicted Playing XI for Hyderabad T20I Full Details Here

ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి..
జట్టు యాజమాన్యం గత మ్యాచ్‌ల్లో లాగే ఈ మ్యాచ్‌లోనూ ముగ్గురు ఆల్‌రౌండర్లను కొనసాగించే అవకాశం ఉంది. నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఈ స్థానాల్లో రాణించనున్నారు. గత మ్యాచ్‌లో ఈ ముగ్గురు కలిసి బ్యాటింగ్‌లో 52 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!
IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!

ప్రిన్స్ యాదవ్ ఔట్.. కుల్దీప్ యాదవ్ ఇన్?
హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం పెద్దది కావడం వల్ల అదనపు పేసర్ కంటే స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించడం జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను పక్కన పెట్టి, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో భారత్ ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ఆల్‌రౌండ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌తో పాటు పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ టీ20 కోసం భారత అంచనా తుది జట్టు ఇదే..
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+