ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో మమితా బైజు వివాహం..? క్లారిటీ ఇచ్చిన మలయాళం బ్యూటీ

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది మలయాళం బ్యూటీ మమితా బైజు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. ప్రేమలు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మమితా బైజు. ఆ తర్వాత ఈ ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్ జన నాయగన్, సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే నివిన్ పౌలితో బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమాల్లో నటించింది. సహజమైన హావభావాలు, పాత్రకు తగ్గ భావోద్వేగాలు, చిలిపి చేష్టలు ఇలా తన నటనతో కొద్ది కాలంలోనే కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ మలయాళం బ్యూటీ. తాజాగా ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర చేసే అవకాశం కూడా వచ్చింది.

అయితే గత కొద్ది కాలంగా మమితా బైజు పెళ్లికి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారని.. అలాగే రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లి రావడాన్ని ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ చూశారని.. అలాగే వీళ్లిద్దరి వివాహానికి ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారని.. ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

మరోవైపు మమితా బైజుకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని.. ముఖ్యంగా ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలనుకునేది కూడా తన సోదరుడు మిథున్ బైజునే నిర్ణయిస్తాడు. తనకు వచ్చే లవ్‌ ప్రపోజల్స్‌ ను హ్యాండిల్‌ చేసేది కూడా అతడే.. అంటూ సామాజిక మాధ్యమాలో వస్తున్న పోస్టులకు తాజాగా మమితా బైజు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ మేరకు దీనిపై ఫన్నీగా స్పందించింది. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఓ ఎంటర్ టైన్ మెంట్ పేజ్ పోస్ట్ చేయగా దానికి వాట్ అనే స్టిక్కర్ ను రిప్లైగా పెట్టింది మమితా బైజు. దాంతో ఆమె పెళ్లి రూమర్ కు ఫుల్ స్టాప్ పడినట్టు అయింది.

MamithaBaiju to marry a young Tollywood hero viral The Malayalam beauty says his decision is final

ఇక ఈ ఏడాది హాట్రిక్ హిట్స్ అందుకున్న మమితా బైజు.. ప్రస్తుతం తమిళ రొమాంటిక్ డ్రామా అయిన ఇరండు వానంలో నటిస్తోంది. ఈ చిత్రానికి డీ. రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. అలాగే జై హనుమాన్ చిత్రంలోనూ మమితా బైజు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. జై హనుమాన్ అనంతరం తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించనుంది మమితా బైజు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+