ఆర్సీబీ రహస్యాలను వెల్లడించిన విజయ్ మాల్యా
ఒకప్పటి దేశీయ పారిశ్రామిక దిగ్గజం, లిక్కర్ బరూన్ విజయ్ మాల్యా పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కర్ణాటకకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్త పేరుగాంచిన మాల్యా.. రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటూ లండన్ లో తలదాచుకుంటోన్నారు. 2016లో దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన.. రెండు రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోన్నారు.
దీనికి కారణాలు లేకపోలేదు. ఆయనకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఛాంపియన్ గా నిలవడమే. 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా ట్రోఫీని ముద్దాడిందా విజయ్ మాల్యా టీమ్. ఈ ఘన విజయాన్ని తనదైన స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు విజయ్ మాల్యా. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఇందులో ప్రస్తావించారు. ప్రత్యేకించి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

విజయ్ మాల్యా వెల్లడించిన ఆర్‌సీబీ రహస్యాలు
విజయ్ మాల్యా ఆర్సీబీ జట్టును ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో స్వయంగా వెల్లడించారు. దాదాపు రూ.1.75 లక్షల కోట్ల భారీ మద్యం సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత, 2008లో ఆర్‌సీబీ జట్టును కొనుగోలు చేయడం వెనుక ఒక వ్యూహం ఉందని ఆయన తెలిపారు. సుమారు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ జట్టును కొనుగోలు చేశానని చెప్పారు.
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మాల్యా మద్యం వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు. తన వ్యాపారాలను విస్తరించడానికి, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఆర్‌సీబీ జట్టును ఒక వేదికగా ఉపయోగించుకున్నట్లు ఆయన తెలిపారు. తన బ్రాండ్‌ను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగానని ఆయన పేర్కొన్నారు.
తన లిక్కర్ బ్రాండ్ రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఓ బిగ్గెస్ట్ మార్కెట్‌ను సృష్టించాలని అనుకున్నానుని, యూనివర్సల్ గా అందరూ అభిమానించే క్రికెట్ ను దీనికి ఆధారంగా చేసుకున్నానని అన్నారు. ఈ కారణంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరుతో ఐపీఎల్ లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు విజయ్ మల్యా.
తన మద్యం వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే విజయ్ మాల్యా.. ఆర్సీబీ జట్టును కొనుగోలు చేశారనేది ఇక్కడ స్పష్టమవుతోంది. తద్వారా తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఆయన ఆలోచన ఒకరకంగా ఫలించినట్టే. ఐపీఎల్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా గుర్తింపు పొందింది ఆర్సీబీ.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications