వినేశ్ ఫొగట్‌కు బ్యాడ్ న్యూస్.. పతకం లేదని తేల్చేశారు..!

పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. తన అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్)‌ను ఆశ్రయించిన వినేశ్.. రజతం ఇవ్వాలని అభ్యర్థించింది. వినేశ్ అప్పీలుపై విచారణ చేపట్టిన సోలో ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్‌(ఆస్ట్రేలియా) తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది. వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని భారత ఒలింపిక్ సంఘం ఆశించింది. కాస్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేస్తామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్) తిరస్కరించినట్టు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం రజత పతకం ఇవ్వలేమని, ఆమె అభ్యర్థనను తిరస్కరించాలని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వేసిన పిటిషన్‌ను విచారించిన CAS వినేష్ ఫోగట్‌ అప్పీల్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఒలింపిక్స్‌ సంఘం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) సైతం ఈ ఇష్యూపై స్పందించలేదు.

Vinesh Phogat Petition For Silver In Olympics 2024 Dismissed By Court

మరోవైపు అదనపు బరువు పెరగడం వెనుక వినేశ్ ఫొగట్‌దే తప్పని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌ పీటీ ఉష తేల్చేశారు. బరువు పెరగడంలో వినేష్‌ ఫోగట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్‌లు, సహాయక సిబ్బందిదే తప్పు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వినేష్‌ ఫోగట్‌ బరువు పెరగడంలో మెడికల్‌ టీమ్‌ తప్పిదం ఎంత మాత్రం లేదని పీటీ ఉష స్పష్టం చేశారు. కోచ్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయని, బరువు, ఫిట్‌నెస్‌, డైట్‌ విషయంలో వారిదే పూర్తి బాధ్యత అని , ఇప్పుడుతప్పు మరొకరి మీద నెట్టి వేయడం సమంజసం కాదని పీటీ ఉష తెలిపారు. అయితే కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో వినేష్‌ ఫోగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడంతో ఆమె ఏ పతకం పొందకుండా అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+