రంజీల్లో విరాట్ కోహ్లీ.. సంపాదన తెలిస్తే షాక్..!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్న ఫ్యాన్ బేస్ అంతాఇంతా కాదు. మ్యాచ్ ఏదైనా కొహ్లీ క్రీజులో ఉన్నాడంటే చాలు వేలమంది అభిమానులు అక్కడ వాలిపోతుంటారు. ఇక ఈ రన్ మెషన్ దాదాపు 12ఏళ్ల తర్వాత రంజీల్లో బరిలోకి దిగుతున్నాడు. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ దిల్లీ తరఫున ఆడాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు. అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కోహ్లీ ఎంత సంపాదిస్తాడనేది చాలామందికి అవగాహన ఉంది. కానీ రంజీల్లో కోహ్లీ ఎంత సంపాదిస్తాడనేది చాలా మందికి తెలియదు. అయితే రంజీల్లో ఒకరోజు ఆడితే కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
రంజీల్లో ఆడాల్సిందే..
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచింది టీమ్ ఇండియా జట్టు. దీంతో టీమ్ ఇండియా ప్లేయర్స్ అంతా టీమ్ ఇండియా జట్టుకు తిరిగి సెలక్షన్ అవ్వాలంటే కచ్చితంగా రంజీ ట్రోఫీలో పాల్గొనాలని కండిషన్ పెట్టింది.

12 ఏళ్ల తర్వాత రంజీల్లో కోహ్లీ
దాదాపు 12 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ రంజీల్లో ఆడుతున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ తరఫున కోహ్లీ ఆడాడు. ఈ మ్యాచ్ ల ద్వారా తన స్కిల్స్ ను మరోసారి సానపట్టాలని కోహ్లీ ఆలోచనలో ఉన్నాడు.
రంజీల్లో సంపాదన..
సాధారణంగా రంజీల్లో ఆటగాళ్ల ఎక్స్ పీరియన్స్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడారు.. అన్న ఆధారంగా రెమ్యునరేషన్ ఉంటుంది. 40 కంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లకు రూ. 60వేలు ఉంటుంది. 21-40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ కు రూ. 50వేలు, 20 అంతకంటే తక్కువ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లకు రూ. 40 వేలు మ్యాచ్ కు అందిస్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడని ప్లేయర్లకు రోజుకు రూ. 20వేల నుంచి రూ. 30వేల మధ్య ఉంటుంది.
రంజీల్లో కోహ్లీ సంపాదన..
ఇప్పటివరకు రంజీల్లో కోహ్లీ కేవలం 23 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. దీంతో దిల్లీ vs రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ లో రూ. 60వేలు పొందాడు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో కోహ్లీ మొత్తం సంపాదన రూ. 2,40,000 గా ఉంది.












Click it and Unblock the Notifications