సెంచరీతో విరాట్ కోహ్లీ వీరవిహారం..అదరగొట్టిన కింగ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. 143 బంతుల్లో కోహ్లీ సెంచరీ బాదేశాడు. 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో విరాట్ కోహ్లీ ఈ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లి తన 28వ టెస్ట్ సెంచరీని పొందడానికి 3 సంవత్సరాలు, 3 నెలల,20 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత, టెస్ట్ ఫార్మాట్‌లో అతను తన తర్వాత సెంచరీని 2023లో సాధించాడు.

2023లో వెస్టిండీస్‌లో భారత పర్యటనలో విరాట్ కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. అతను మొదటి టెస్టులో 76 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ సెంచరీని సాధించి డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ సెంచరీల రికార్డును సమం చేశాడు. ఇది కోహ్లికి 81వ అంతర్జాతీయ సెంచరీ.టెస్టుల్లో 30వ సెంచరీని నమోదు చేశాడు.టెస్టుల్లో అత్యధిక సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచారు.

Virat Kohli s century in Test match against Australia in Perth

ఇక పెర్త్‌ టెస్ట్ విషయానికి వస్తే మూడో రోజు ఆటలో కూడా టీమిండియా అధిపత్యం సాగుతోంది. టీమిండియా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 487/6 పరుగులకు డిక్లేర్ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (77) అర్ధశతకం సాధించగా, పడిక్కల్‌ (25), సుందర్‌ (29) ఫర్వాలేదనిపించారు. నితీశ్‌ (38*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులు చేయగా, ఆసీస్‌ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. 100 పరుగులతో కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. 534 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన నాథన్ ఆండ్రూ మెక్‌స్వీనీ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బుమ్రా తన తొలి ఓవర్‌లోనే ఈ వికెట్ తీసి భారత జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+