Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియా.. మేమంతా మీతోనే..: ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇలా

అహ్మదాబాద్: 1983, 2011 తర్వాత మూడోసారి 2023లో టీమిండియా.. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ తన సొంతం చేసుకుంటుందనుకున్న కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత ఆటగాళ్లతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.

కాగా, వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన టీమిండియా ఆటగాళ్లకు అంతా అండగా నిలుస్తున్నారు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీలో టీమిండియా ప్రదర్శన పట్ల క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు సానుకూలంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియాకు మద్దతుగా ఉన్నామన్నారు.

We Stand With You Today And Always: PM Modi To Indian Cricket Team After World Cup Loss

'డియర్ టీమిండియా ఈ ప్రపంచ కప్‌లో మీ ప్రదర్శన, కప్ సాధించాలనే మీ సంకల్పం ఎంతో విశేషమైనవి. గొప్ప స్ఫూర్తితో మ్యాచ్‌లు ఆడారు. దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టారు. మేము ఈ రోజు, ఎల్లప్పుడూ మీతో ఉంటాం' అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోవైపు, వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో ప్రశంసనీయమైన ప్రదర్శన చేశారని, అద్భుతమైన విజయంతో ముగించారని మోడీ పేర్కొన్నారు. అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్‌కు అభినందనలు తెలియజేశారు.

We Stand With You Today And Always: PM Modi To Indian Cricket Team After World Cup Loss

ఆసీస్‌కు వరల్ కప్ అందించిన ప్రధాని మోడీ, ఆసీస్ డిప్యూటీ పీఎం

దాదాపు 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ సంరంభం ఆదివారంతో ముగిసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వరల్డ్ కప్‌ను బహూకరించారు. 6వ సారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టును వారు అభినందించారు.

టీమిండియాకు మద్దతుగా సీఎం జగన్ ట్వీట్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగాపై స్పందించారు. 2023 వరల్డ్ కప్‌లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమను చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. టీమిండియా దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అని జగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, టీడీపీ నేత నారా లోకేష్ కూడా టీమిండియా పోరాట స్ఫూర్తి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+