PAK vs WI:చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 35 ఏళ్ల తర్వాత తొలిసారి

వెస్టిండీస్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ జట్టు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు వెస్టిండీస్ 1990లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌పై విక్టరీ సాధించింది. ఆ తర్వాత 1997,2006లో పాక్‌ పర్యటనకు వెళ్లినా ఓటమితోనే సిరీస్ ముగించింది. మళ్లీ ఇన్నాళ్లకు పాక్ గడ్డపై గెలిచి చరిత్ర సృష్టించింది విండీస్ జట్టు. వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ జొమెల్ వారికాన్ మ్యాజిక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకున్నాడు. కెవిన్‌ సింక్లెయిర్‌ 3 వికెట్లు తీసుకోగా.. మోటీ 2 వికెట్లు రాబట్టాడు. దీంతో పాకిస్థాన్ ఈ ఇన్నింగ్స్ లో పాక్ 133 పరుగులకే కుప్పకూలింది.

మ్యాచ్ సాగిందిలా..

254 పరుగుల లక్ష్యంతో పాకిస్థాన్ 76/4తో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించింది. ఈ ఇన్నింగ్స్​లో పాక్ 133 పరుగులకే ఆలౌటైంది. ఓవర్​నైట్ స్కోర్​కు కేవలం 57 పరుగులే జోడించి.. ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. బాబర్ అజామ్ (31 రన్స్) టాప్ స్కోరర్. మహ్మద్ రిజ్వాన్ (25 రన్స్), కమ్రాన్ గులాం (19 రన్స్), సౌద్ షకీల్ (13 రన్స్), సల్మాన్ ఆఘా (15 రన్స్) చేశారు. ఈ విజయంతో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది.

West Indies Defeat Pakistan by 120 Runs End 35-Year Wait for Victory

పాకిస్థాన్ పై వెస్టిండీస్ విక్టరీ సాధించడంపై వెస్టిండీస్ టీమ్ ను ఆ జట్టు టెస్టు కెప్టెన్ బ్రాత్ వెయిట్ ప్రశంసించారు. టీమ్ పై తనకు గర్వంగా ఉందన్నారు. జొమెల్ వారికాన్, మోటీలు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+