భారత్ సెమీస్ ఆశలు చెల్లాచెదురు- నెట్ రన్ రేట్ గతిని మార్చిన వెస్టిండీస్
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 సెమీ ఫైనల్ రేసు మ్యాచ్ మ్యాచ్ కు ట్విస్టులు తిరుగుతోంది. మరింత ఉత్కంఠతగా మారుతోంది. ఓ మాంచి థ్రిల్లర్ ను తలపిస్తోంది. దక్షిణాఫ్రికా భారత్‌ను ఓడించగా, వెస్టిండీస్ జింబాబ్వేపై తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఏకంగా 107 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా కూడా 76 పరుగుల తేడాతో భారత్ ను ఓడించడం వల్ల ఆ రెండు జట్లూ అద్భుతమైన నెట్ రన్ రేట్ ను సాధించాయి.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 254 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్మెయిర్ సునామీ ఇన్నింగ్ ఆడాడు. తనకు దొరికిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్నాడు. ఏడేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లను స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. అనంతరం జింబాబ్వే 147 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ ఫలితాలు సెమీఫైనల్ సమీకరణాలను మార్చివేశాయి. భారత్ సెమీస్ చేసే అవకాశాలను మరింత క్లిష్టతరం చేశాయి. ప్రస్తుతం గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టుకు ఉన్న పాయింట్లు.. రెండు. తిరుగులేని నెట్ రన్ రేట్ సాధించిందీ టీమ్. +5.350 నెట్ రన్ రేట్ ఈ జట్టు ఖాతాలో ఉంది. భారత్ ను ఓడించిన దక్షిణాఫ్రికా కూడా రెండు పాయింట్లను అందుకుంది. +3.800 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది.
ఆడిన ఒక్క మ్యాచ్ లో ఓడిపోవడం వల్ల భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా జమ కాలేదు. ప్రస్తుతం ఈ జట్టు నెట్ రన్ రేట్ -3.800. అలాగే వెస్టిండీస్ తో చేతిలో చిత్తయిన జింబాబ్వే నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో పడిపోయింది. -5.350 గా నమోదైంది. జింబాబ్వే కంటే టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.
తాజా గెలుపుతో వెస్టిండీస్ సెమీస్ రేసులో ముందంజలో ఉంది. జింబాబ్వే నిరాశాజనక స్థితికి చేరింది. వెస్టిండీస్‌కు మిగిలినవి భారత్, దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన మ్యాచ్‌లే. ఈ రెండింట్లో ఒక మ్యాచ్ లో ఓడిపోయినా వెస్టిండీస్ కు పోయేదేమీ ఉండదు. అత్యుత్తమ నెట్ రన్ రేట్ తో సెమీస్ ఆశలు సజీవంగానే ఉంటాయి. జింబాబ్వే చేతిలో కూడా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ కూడా అత్యంత కఠినమైనవే. తనకంటే ఎంతో బలంగా ఉన్న దక్షిణాఫ్రికా, భారత్‌ను ఢీ కొనాల్సి ఉంటుంది.
తన తదుపరి మ్యాచ్ లల్లో భారత్.. వెస్టిండీస్, జింబాబ్వేలతో తలపడాల్సి ఉంది. అలాగే దక్షిణాఫ్రికా కూడా రెండు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లూ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే అప్పుడు వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికాల జట్లకు ఆరు చొప్పున పాయింట్లు లభిస్తాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ ద్వారానే సెమీఫైనల్ అర్హత నిర్ణయాత్మకమౌతుంది. ఇది గ్రూప్ 1 క్వాలిఫికేషన్‌ను ప్రభావితం చేస్తుంది.
-3.800 పడిపోయిన భారత్.. సెమీఫైనల్‌కు చేరాలంటే తన రెండు మ్యాచ్‌లలో అతి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు గానీ వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ దక్కదు. అలాగే- దక్షిణాఫ్రికా కూడా తన మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు వెస్టిండీస్, జింబాబ్వేలకు రెండేసి చొప్పున పాయింట్లు ఉంటాయి. సెమీస్ కు భారత్, దక్షిణాఫ్రికా క్వాలిఫై అవుతాయి.
ఒకవేళ- దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో ఓడితే, నెట్ రన్ రేటే అర్హతను నిర్ణయిస్తుంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండింటి కంటే భారత్ నెట్ రన్ రేట్ ప్రస్తుతం తక్కువగా ఉండటం సెమీస్ అవకాశాలను కష్టతరం చేస్తుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications