రోహిత్ శర్మ, కోహ్లీకి డబుల్ షాక్- వన్డేల నుంచీ అవుట్?

టీమిండియా వన్డే ఫార్మట్ కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. వారిద్దరూ ఇంకా ఈ ఫార్మట్ లో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీసీలో తాజా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు మయం అయ్యాయి. ఈ జాబితా టాప్ 10 నుంచి వారిద్దరూ ఆకస్మికంగా అదృశ్యం అయ్యారు. ఒక వారం ముందు- అంటే ఈ నెల 13వ తేదీన ఇదే ఐసీసీ విడుదల చేసిన వన్డే ఇంటర్నేషన్స్ ర్యాంకింగ్ లల్లో రోహిత్ రెండో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీది నాలుగో స్థానం.

What Does It Mean ICC ODI Rankings reportedly See Rohit Sharma and Virat Kohli Removed

ఇప్పుడు తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్ లల్లో ఇద్దరి పేర్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి ఇదివరకే తప్పుకొన్న కారణంగా ఈ రెండింట్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను ఐసీసీ తొలగించింది కూడా. ఇప్పుడు తాజాగా వన్డే ర్యాంకింగ్ లోనూ ఇదే పరిస్థితి తలెత్తడం అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.

ఈ నెల 13వ తేదీన విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్ లల్లో రోహిత్ వన్డే ర్యాంకింగ్స్‌లో 756 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో కనిపించాడు. కోహ్లీ 736 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. శుభమన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇప్పుడు గిల్ టాప్ పొజీషన్ లో ఉన్నప్పటికీ- రోహిత్ స్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్, కోహ్లీ ప్లేస్ లో లంక బ్యాటర్ చరిత్ అసలంక పేర్లు కనిపించాయి. సిస్టమ్‌లో ఏర్పడిన గ్లిచ్ కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే మ్యాచ్ ఆడారు.

ఆ టోర్నమెంట్ ఫైనల్‌లో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. దశాబ్ద కాలంలో మొదటి ఐసీసీ వన్డే ట్రోఫీని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో కోహ్లీ దుమ్ము రేపాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై భారీ ఇన్నింగ్ ఆడాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+