చాహల్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..అందుకే భార్యకు విడాకులా..?
టీమిండియా క్రికెటర్ చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ తళుక్కున మెరిశాడు.అయితే ఇందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా..?. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. మనోడి సింగిల్‌గా వచ్చి మ్యాచ్ చూస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు.చాహల్ ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్‌ను చూడటానికి వచ్చాడు.దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, చాహల్ స్టాండ్స్‌లో ఒక మహిళతో కనిపించాడు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాహల్‌తో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీయగా, ఆమె ఓ ఆర్జేగా తెలుస్తోంది.
సదరు యువతి పేరు ఆర్జే మహవాష్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ , రేడియో జాకీగా మహవాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రాంక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు.యుజ్వేంద్ర చాహల్తో ఆమె కనిపించడం వలన ఆమె వార్తల్లో నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందని పుకార్లు వచ్చాయి, అయితే మహవాష్ వాటిని ఖండించారు.

ఇదిలా ఉంటే తనిష్క కపూర్ అనే హీరోయిన్‌తో చాహల్ డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది.తనిష్క కపూర్ కన్నడలో రెండు సినిమాల్లో నటించింది. ధనశ్రీతో పరిచయం కాకముందే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఈ వార్తలను చాహల్ ఖండించాడు. పెళ్లి అయిన తర్వాత కూడా తనిష్క కపూర్‌తో చాహల్ సీక్రెట్ అఫైర్ నడిపించాడని, దాంతో ధనశ్రీతో గొడవలు మొదలయ్యాయనే వాదను కూడా తెరపైకి వచ్చింది. చాహల్ వ్యవహారం నచ్చకనే ధనశ్రీ వర్మ విడాకులు ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భార్య ధనశ్రీ వర్మతో విడాకుల కేసు నడుస్తున్న సమయంలో చాహల్ ఇలా తనిష్క కపూర్‌తో కనిపించడం సంచలనంగా మారింది. చాహల్ తనిష్క కపూర్‌తో కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.చాహల్ కొత్త ప్రియురాలు ఈమె అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, భార్యకు విడాకులిచ్చి, కొత్త ప్రియురాలను సెట్ చేసుకున్నాడని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ అమ్మాయి కారణంగానే ధనశ్రీ వర్మ చాహల్‌కు విడాకులిచ్చి ఉంటుదనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. చాహల్ ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మకు విడాకులిచ్చాడు.
చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడాకుల బాట పట్టారు.వీరి విడాకులపై తొలుత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొదట చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేశాయి.
ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వీరు విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు.తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత చాహల్ తనిష్క కపూర్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆమెను తీసుకువచ్చాడని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంపై చాహల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications