IPL 2025: ఈ టైం కీలకం, డోన్ట్ మిస్ - రెండు లిస్టుల్లో జాక్ పాట్ ప్లేయర్లు..!!

IPL Auction 2025: క్రికెట్ ఫ్యాన్స్ ఈ రోజు బిగ్ సండే. ఐపీఎల్ మెగా ఆక్షన్ కు సర్వం సిద్దం అయింది. జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ ఆక్షన్ పైన అంచనాలు క్షణం క్షణం పెరిగిపోతున్నాయి. పది టీం ల ఫ్రాంచైజీలు ..వారి కోచ్ లు ఆటగాళ్ల ఎంపిక కోసం కొత్త వ్యూహాలతో సిద్దమవుతున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఆక్షన్ లో తొలి రెండు గంటలే కీలకం. తొలి రెండు లిస్టులో ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఈ లిస్టుల్లో ఉన్నదెవరు.

ఏ లిస్టులో ఎవరు
ఐపీఎల్ ఆక్షన్ ఈ సారి మరింత ఉత్కంఠగా మారుతోంది. మొత్తం ఆక్షన్ కోసం 574 మంది ఆట గాళ్లు అర్హత సాధించారు. వారి తమ లక్కును పరీక్షించుకుంటున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 208 మంది విదేశీ ప్లేయర్లు. అయితే, ఈ వేలంలో తొలి గంట సమయం కీలకంగా మారుతోంది. టాప్ ప్లేయర్లు తొలి రెండు లిస్టుల్లోనే ఉన్నారు. ఐపీఎల్ లో అసలైన మజా ను అందించే అభిమాన టాప్ ఆటగాళ్లు ఈ జాబితాల్లోనే ఉండటంతో.. తొలి రెండు లిస్టుల ఆక్షన్ ఆసక్తిని పెంచుతోంది. ఇందు కోసం ఇప్పటికే ప్రసార హక్కులు పొందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రెండు లిస్టుల్లో ఉన్నవారి కోసం ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు.

ఐపీల్ వేలం 2025 LIVE: మెగా వేలంలో ఆ అదృష్టవంతుడు ఎవరు..?

Why Is This Mega Auction Special Who will get jock pot in IPL Auction see details

వీరికి భారీ డిమాండ్
ఈ సారి ఆక్షన్ లో ప్రముఖ ప్లేయర్లు సెట్ 1, సెట్ 2 లిస్ట్​లోకి వచ్చేశారు. అర్ష్​దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్​ లాంటి స్టార్ క్రికెటర్లు సెట్​ 1లో ఉన్నారు. ఇక సెట్ 2లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, లియమ్​ లివింగ్​స్టోన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక, రూ. 2 కోట్ల అత్యధిక బేస్ ధర కేటగిరిలో 81 మంది బరిలో ఉన్నారు. అందులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత రూ. 1.5 కోట్ల కేటగరీలో 27, రూ. 1.25 కోట్ల లిస్ట్​లో 18, ఇక రూ.1 కోటి కేటగిరిలో 23 మంది ప్లేయర్లు ఉండటంతో ఆక్షన్ మరింత ఆసక్తిగా మారుతోంది.

టీంల వద్ద నిల్వలు
ఈ సారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగనుంది. రూ.110.5 కోట్లతో వేలంలో మెరవనున్న ఈ ఫ్రాంచైజీ తమ జట్టులోకి స్టార్ ప్లేయర్లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.55 కోట్లతో, అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.51 కోట్లతో మెగా మేలంలోకి దిగుతున్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రూ. 83 కోట్ల పర్స్ వాల్యుతో రానుంది. అలాగే దిల్లీ క్యాపిటల్స్ రూ. 73 కోట్లు, లఖ్​నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, తలో రూ.69 కోట్లతో రానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఆక్షన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+