భారత్ మహిళల వరల్డ్ కప్ ను గెలిచిన వేళ.. సంచలన నిర్ణయం

ఐసీసీ వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు కైవసం చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పలు కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఇదివరకేే జట్టుకు బీసీసీఐ తీపికబురు వినిపించింది. విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు భారీగా క్యాష్ రివార్డు ప్రకటించింది. ఆదివారం నవీ ముంబై స్టేడియంలో జరిగిన విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన జట్టుపై కనకవర్షాన్ని కురిపించింది. వరల్డ్ కప్ ను గెలిచినందున భారీ నగదు బహుమతిని అందజేయనుంది. దీని విలువ 51 కోట్ల రూపాయలు.

ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమెన్స్ వరల్డ్ కప్ ను మరింత విస్తరించింది. ఇకపై మొత్తం 10 జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడనున్నాయి. 2029 ఐసీసీ వరల్డ్ కప్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ టోర్నమెంట్ ఎనిమిది జట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. మహిళల వరల్డ్ కప్ కు లభిస్తోన్న అపూర్వ ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

Women s ODI World Cup 2029 Expands to 10 Teams

ఈ ప్రపంచకప్‌లో దాదాపు 3,00,000 మందికి పైగా అభిమానులు స్టేడియాల్లో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించారు. టీవీ, యూట్యూబ్, యాప్ వంటి ప్లాట్ ఫామ్ ల ద్వారా మ్యాచ్ లను తిలకించిన ప్రేక్షకుల సంఖ్య దీనికి అదనం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళల క్రికెట్ మ్యాచ్ లను తిలకించారు. ఇటువంటి ఆదరణ గతంలో ఎప్పుడూ లేదు. ఇది మహిళల క్రికెట్ ఈవెంట్‌లకు సంబంధించిన అన్ని రకాల టోర్నమెంట్ రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా టీవీ వీక్షకులలో కొత్త రికార్డులను నెలకొల్పిందీ విమెన్స్ వరల్డ్ కప్. ఒక్క భారత్ లోనే దాదాపు 500 మిలియన్ల మంది ఈ టోర్నమెంట్‌ను వీక్షించారు. 2029 నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, పురుషుల వరల్డ్ కప్ టోర్నమెంట్ కు సమానంగా ఆదరణ లభిస్తుందని ఐసీసీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో- ఇక విమెన్స్ వరల్డ్ కప్ ను విస్తరించాలని, మొత్తం 10 జట్లు ఇందులో ఆడేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+