వరల్డ్ కప్ ఫైనల్ ఆడేది ఈ రెండు జట్లే- క్రిస్ గేల్ జోస్యం

ముంబై: దేశంలో ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ ఫీవర్ ఆరంభమైంది. ప్రస్తుతం వామప్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అసలు సిసలు మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదికగా తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది.

2019 ప్రపంచకప్ ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడ్డ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ కూడా కలుపుకొంటే మొత్తం 48 మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. నవంబర్ 12వ తేదీన భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. అదే నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

World Cup 2023: Chris Gayle pics these 2 teams for the final

భారత జట్టు ముందు బిగ్గెస్ట్ టాస్క్ ఈ టోర్నమెంట్. ఈ నెల అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మొన్నటికి మొన్నే మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు ఉన్న ప్లస్ పాయింట్. చివరి మ్యాచ్ ఓడినప్పటికీ సిరీస్‌ను సొంతం చేసుకోగలిగింది.

11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. అందరి దృష్టీ ఈ మ్యాచ్ మీదే ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తన తొలి వామప్‌లో న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచింది పాక్.

342 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ- మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు న్యూజిలాండ్ బ్యాటర్లు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 97 పరుగులతో సత్తా చాటాడు. కేప్టెన్ కేన్ విలియమ్సన్, ఇతర బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలిగారు.

ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ ఎవరి వశం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తోన్నారు. సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్.. ఇలా పలువురు మాజీ క్రికెటర్లు సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులపై తమకు ఉన్న అంచనాలను బయటపెట్టారు.

తాజాగా వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ క్రిస్ గేల్.. తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్- పాకిస్తాన్ తలపడతాయని స్పష్టం చేశాడు. ఈ రెండు జట్లకే ఆ సత్తా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఈ రెండు జట్లూ సమతౌల్యంగా ఉన్నాయని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+