వరల్డ్ కప్‌లో టీమిండియా చివరి మ్యాచ్: స్టేడియంలో పేలేవి లక్ష్మీ బాంబులే

బెంగళూరు: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023 లీగ్ దశ నేటితో ముగియబోతోంది. నేడు భారత్.. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొననుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

ఈ వరల్డ్ కప్‌లో ఇదే చిట్టచివరిది లీగ్ మ్యాచ్. దీని తరువాత సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు.. సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

World cup 2023, IND vs NED: India playing 11 against Netherlands

భారత్- న్యూజిలాండ్‌‌తో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో పొజీషన్‌లో ఉన్న టీమ్‌తో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. రెండో స్థానంలో ఉన్న జట్టు.. తన తరువాతి ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.

ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్.. వైదొలిగాయి. లీగ్ దశలోనే ఈ ఆరు జట్ల ప్రస్థానం ముగిసింది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి అవసరమైనన్ని పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను సాధించలేకపోయాయి.. ఈ ఆరు జట్లు కూడా.

సెమీ ఫైనల్స్‌కు ముందు జరిగే నేటి మ్యాచ్‌.. టీమిండియాకు ఓ మంచి ప్రాక్టీస్‌లా మారొచ్చు. ప్రత్యర్థి అంతగా బలమైన జట్టు కాకపోవడం వల్ల అటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు చెలరేగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా ఫుల్ ఫామ్‌లో ఉన్నందున చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎదుర్కొంటోన్నది నెదర్లాండ్సే అయినప్పటికీ.. ఎలాంటి ప్రయోగాలకు భారత్ పూనుకోవట్లేదు. ఇప్పుడున్న ప్లేయర్లనే నెదర్లాండ్స్‌పై ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం స్పష్టం చేశారు. ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ల జోలికి వెళ్లదలచుకోలేదని అన్నారు.

తుదిజట్టులో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. జట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్/ రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా/ ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+