అమ్ముడుపోని ఆస్ట్రేలియా కెప్టెన్! WPL వేలంలో ఊహించని షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 కోసం మెగా-వేలం గురువారం నాడు ఢిల్లీలో ప్రారంభమైంది. మొత్తం 277 మంది క్రీడాకారిణుల భవితవ్యం నిర్ణయించబడనున్న ఈ వేలంలో, ప్రారంభంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్- వికెట్ కీపర్-బ్యాటర్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కీలక క్రీడాకారిణి అయిన అలిస్సా హీలీ అమ్ముడుపోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలిస్సా హీలీ బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలుగా నిర్ణయించబడింది. ఆమె ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్నా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, ఏ ఫ్రాంచైజీ కూడా ఆమెను దక్కించుకోవడానికి ఆసక్తి చూపలేదు.
దీనికి ముఖ్య కారణం ఆమె ఫిట్‌నెస్‌పై ఉన్న సందేహాలుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన హీలీ ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో కండరాల గాయంతో బాధపడింది. దీని కారణంగా ఆమె ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్‌లకు దూరమైంది. గతంలో కూడా ఆమె వేలికి గాయమైంది. రాబోయే డబ్ల్యూపీఎల్ సీజన్‌కు ఆమె ఎంతవరకు ఫిట్‌గా ఉంటుందనే విషయంలో ఫ్రాంచైజీలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే రిస్క్ తీసుకోవడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు.

గతంలో 2023లో జరిగిన వేలంలో యూపీ వారియర్జ్ ఆమెను ఏకంగా 70 లక్షలకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఈసారి ఆమెను అట్టిపెట్టుకోకుండా వదిలేయడం ఇప్పుడు తిరిగి కొనుగోలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ మెగావేలంలో చాలా మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ వేలంల అతిచిన్న వయస్సు క్రీడాకారిణులుగా 16 ఏళ్ల దియా యాదవ్, భారత్ సింగ్ ఉన్నారు. కాగా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (37) ఈ వేలంలో అందరికంటే పెద్ద వయస్కురాలిగా ఉంది. ప్రతి ఫ్రాంచైన ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం ఐదు జట్లలో కలిపి 73 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 23 విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించబడ్డాయి.












Click it and Unblock the Notifications