యశస్వి గొడవ వెనుక అసలు నిజం: ఆ బౌలర్ బూతులపై జురేల్ సెన్సేషనల్ కామెంట్స్!

కొలంబో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిథా ఫెర్నాండోల మధ్య స్డేడియంలో జరిగిన తీవ్ర వాగ్వాదం తీవ్ర చర్చనీయాంఖమైన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ వివాదంపై భారత వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురేల్ స్పందిస్తూ.. ఆ సమయంలో మైదానంలో అసలేం జరిగిందో పూర్తి వివరాలను బయటపెట్టాడు.

భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!
భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో జరిగిన ఓ సంభాషణలో ధ్రువ్ జురేల్ ఈ విషయాలను వెల్లడించారు. "యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్ధంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్నాడు. కానీ శ్రీలంక బౌలర్ అసిథా ఫెర్నాండో అతడిని నిరంతరం దూషిస్తూనే ఉన్నాడు. ఆ బూతులు భరించలేకే యశస్వి జైస్వాల్ వెనక్కి తిరిగి బదులిచ్చాడు. మీరు రీప్లే ఫుటేజ్ చూస్తే యశస్వి జైస్వాల్ ముందస్తుగా ఎలాంటి గొడవ పెట్టుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది" అని ధ్రువ్ జురేల్ వివరించాడు.

Yashasvi Jaiswal Sledging Controversy Dhruv Jurel reveals the truth behind Asitha Fernando row

యశస్వి జైస్వాల్ స్టేడియంలో చాలా శాంతంగా ఉండే ఆటగాడని, స్వయంగా ఎప్పుడూ స్లెడ్జింగ్‌కు దిగడని ధ్రువ్ జురేల్ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వితో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "యశస్వి జైస్వాల్ ఎప్పుడూ తన బ్యాటింగ్‌పైనే శ్రద్ధ పెడతాడు, ఎదుటివారిని రెచ్చగొట్టడు. కానీ ఎవరైనా కావాలని గొడవకు దిగితే మాత్రం వెనక్కి తగ్గే మనస్తత్వం అతడిది కాదు. కచ్చితంగా గట్టిగానే బదులిస్తాడు" అని పేర్కొన్నాడు.

Hurun India Rich List 2026: హైదరాబాద్ లో టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే..
Hurun India Rich List 2026: హైదరాబాద్ లో టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే..
కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ఇద్దరు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. ఆనాటి మ్యాచ్ వాతావరణం, ఆవేశంలోనే పరిణామాలు శృతిమించాయని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+