బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్పీడ్‌స్టర్?

Gautam Gambhir: భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్- భారత జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. అతని నియామకాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు.

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది బీసీసీఐకి. ఆ ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. ఇదివరకే హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ పూర్తి చేసింది కూడా. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను ఇంటర్వ్యూ నిర్వహించింది.

Zaheer Khan or Lakshmipathy Balaji to become the new bowling coach for Team India

ఈ రేసులో గౌతమ్ గంభీర్‌ విజేతగా నిలిచాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం, ఐపీఎల్‌లో తాను మెంటార్‌గా ఉంటోన్న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ కంటే గంభీర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.

హెడ్ కోచ్‌గా అపాయింట్ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే గౌతమ్ గంభీర్ స్పందించాడు. తనకంటూ ఒక గుర్తింపును ఇచ్చిన ఈ దేశానికి సేవ చేయడానికి దక్కిన అతి గొప్ప అవకాశంగా అభివర్ణించాడు. కొత్త బాధ్యతలతో జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. అభిషేక్ నాయర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని గౌతమ్ గంభీర్ కోరాడు.

ఈ రెండింట్లో ఒకటి నెరవేరేలా కనిపించట్లేదు. బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్‌ను నియమించడానికి బీసీసీఐ ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదు. అతని ట్రాక్ రికార్డ్ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడం, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. వంటి బౌలర్లను హ్యాండిల్ చేయలేడని బీసీసీఐ పెద్దలు భావిస్తోన్నారు. వినయ్ కుమార్‌కు బదులుగా మరో ఇద్దరు మాజీ ఫాస్ట్ బౌలర్ల పేర్లను బీసీసీఐ పరిశీలనలోకి తీసుకుంది.

Zaheer Khan or Lakshmipathy Balaji to become the new bowling coach for Team India

ఆ ఇద్దరు- జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ. బౌలింగ్ కోచ్ రేసులో వీరిద్దరూ ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నారు. వీరిలో ఒకరు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వారితో సంప్రదింపులు సైతం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలుస్తోంది .

జహీర్ ఖాన్.. టీమిండియా బెస్ట్ బౌలర్లల్లో ఒకడు. 2011లో ఐసీసీ వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్. భారత జట్టులో మూడు ఫార్మట్లలోనూ మెరిశాడు. 200 వన్డేల్లో 282, 17 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 17, 92 టెస్ట్ మ్యాచ్‌‌లల్లో 311 వికెట్లు పడగొట్టాడు.

తమిళనాడుకు చెందిన లక్ష్మీపతి బాలాజీ కూడా టీమిండియా తరఫున మూడు ఫార్మట్లల్లో ఆడాడు. 30 వన్డేల్లో 34, 5 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 10, 8 టెస్ట్ మ్యాచ్‌‌లల్లో 27 వికెట్లను తీసుకున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+