వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు అమితాబ్‌ నాగార్జున!

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌ః ఎబిసిడి లు రాకుండానగరంలో ఏమీ జరగడం లేదు. ఇక్కడ ఎబిసిడిలంటే చదువు సంధ్యల వ్యవహారంకాదు. అలాగని మాల, మాదిగ వర్గీకరణ కూడాకాదు. ఇది సాంస్కృతిక సభల గొడవ. నగరంలో ఏఆడిటోరియంలో ఏ సభలో చూసినా ఎ, బి, సి, డిలలో ఎవరో ఒకరు ఉండవలసిందే. ఎ అంటే అక్కినేనినాగేశ్వరరావు. బి అంటే భాస్కరరావు ( సభాసామ్రాట్‌) . సి అంటే సి. నారాయణ రెడ్డి. ఇక డిఎవరో చెప్పుకోండి. సాక్షాత్తూ దైవజ్ఞ శర్మ.నగరంలో ఒకేరోజు ఒకేసారి నాలుగు సాంస్కృతిక సమావేశాలు జరిగితేనలుగురు నాలుగు దిక్కులకు వెళ్తారు. ఒకే సభ జరిగితేనలుగురూ ఒకే వేదిక మీద ప్రత్యక్షమవుతారు. ఈ నిత్య సభాకరులకుఅర్జెంటు మెసేజ్‌ లు ఏమైనా వస్తే రవీంద్రభారతికో,త్యాగరాయగాన సభకో వెళ్తే సరిపోతుందని ఈ ప్రముఖులఏరియాలను కవర్‌ చేసే పోస్ట్‌ మ్యాన్లుఆలోచిస్తున్నారట.

ఈ నలుగురూ చాలరన్నట్టు ఈ మధ్యగోపీనాథరెడ్డి అనే పోలీసు ఉన్నతాధికారి కూడా నిత్యసభాకరుడిగా మారారు. ఈ రంగంలో ఇంకా చాలా మందికిఅవకాశం ఉందని, కొత్తగా ఒకరిద్దరు వచ్చినంతమాత్రాన పాతవారు బాధ పడిపోనవసరంలేదని ఒక సాంస్కృతిక సంస్ధ నిర్వాహకుడుఅన్నారు. ఈ సభాకరులందరిలో దైవజ్ఞ శర్మ గారివ్యవహార శైలి అనితర సాధ్యమైనది.కాషాయ దుస్తులతో, కర్లింగ్‌ హెయిర్‌ తో దాదాపు ప్రతి సభలోప్రత్యక్షమయ్యే ఈయన మృదుభాషి. ఆయనహృదయం ఎంత విశాలమైనదంటే నిర్వాహకులు పిలవకపోయినా సభాసమయానికి ఠంచనుగా వేదిక ముందు వరసలోకూర్చుంటారాయన. హడావుడిగా తిరిగే నిర్వాహకులో ఒకరిని పిలిచి ఓ చిన్న

చిటికెలో చిన్న డిమాన్‌ స్ట్రేషన్‌ఇస్తారాయన. ఆశీర్వదిద్దామని విచ్చేశాను అనిచెబుతారు. ఇంత ఘనత వహించిన శర్మ గారుకింద కూర్చోవడమేమిటని నిర్వాహకులు ఎక్‌స్ట్రా కుర్చీ తెప్పించివేదిక మీద వేసి ఆహ్వానిస్తారు. పిఆర్‌ వో లతోఈయన టై అప్‌ లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఉదయానేఅందరిళ్ళకూ ఫోన్‌ చేసి ఆరోజు కార్యక్రమాలను కనుక్కొనిసాయంత్రం అక్కడికి రెక్కలు కట్టుకొని వాలుతారు. సాంస్కృతిక రంగానికిఆయన చేస్తున్న ఈ అయాచిత సేవలకు గుర్తింపగాత్వరలో ఆయనకు ఘనంగా సన్మానం జరగబోతోందట.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X