వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపైబాలయ్య అసంతృప్తి!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, July 10 2004

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీనిచంద్రబాబు నాయుడు నడిపిస్తున్న తీరు పట్ల బాలకృష్ణ తీవ్రఅసంతృప్తితో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు. తన తండ్రిఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్ధాపించారో అవి ఇప్పుడుకన్పించకపోవడం బాధాకరమని ఇటీవల ఆయనను కలిసినఎన్టీఆర్‌ కుటుంబ శ్రేయోభిలాషులతో నిర్మొహమాటంగా ఆయనచర్చించారు.

కాల్పుల సంఘటన జరగక ముందుకాలికి గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఆయనగత ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయానికి గల కారణాలనువిశ్లేషించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంత తెలివితక్కువగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని, ఆయననేలవిడిచి సాము చేయడం వల్లనే టిడిపికి ఈ దుర్గతి పట్టిందని బాలకృష్ణబాధపడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల మీద ఆసక్తిఉన్నట్టు కన్పించని బాలకృష్ణ గత ఎన్నికల్లో టిడిపి ఓటమికికారణాలను విశ్లేషించిన తీరుచూసి ఒకనాటి ఎన్టీఆర్‌ సన్నిహితులైన వృద్ధ నాయకులు ఆశ్చర్యపోయారు.

కాల్పుల సంఘటన తర్వాత బాలకృష్ణకురాజకీయాల మీద ఇంకా ఆసక్తి పెరిగినట్టు చెబుతున్నారు.తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే పోలీసులు తనను అంతఇబ్బంది పెట్టేవారు కాదన్న భావన ఆయన మనసులోనాటుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా అధికారంలోకిరాకపోతే తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందని, తనతండ్రికి ఆత్మశాంతి కొరవడుతుందని బాలకృష్ణ ఆందోళనచెందుతున్నారు.

నారాజకీయ వారసుడు బాలయ్యే అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌1986లో చిత్తూరు జిల్లా పర్యటనలో సంచలన ప్రకటన చేశారు.ఎన్టీఆర్‌ తర్వాత పార్టీ తన చేతిలోకి రావాలని మొదటి

నుంచికాచుకు కూర్చున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌నుంచి ఎన్టీఆర్‌తో ఫోనులో అరగంట సేపు మాట్లాడి వారసుడి విషయంలోఆయన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరారు.అందుకు అనేక కారణాలను ఆయన ఎన్టీఆర్‌ చెప్పారు. తెలుగుదేశంపార్టీకి ఒక కుటుంబపార్టీగా చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతోఎన్టీఆర్‌ కొంత మెత్తబడ్డారు. బాలకృష్ణ వారసత్వంపై ఎన్టీఆర్‌చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా పెద్ద పత్రికల్లో చంద్రబాబునాయుడు సంపాదకీయాలు వచ్చేలా చూశారు.

ఎన్టీఆర్‌నుగద్దె దింపడానికి వైస్రాయ్‌లో జరిగిన డ్రామాలో హరికృష్ణ కీలకపాత్ర వహించారు కానీ బాలకృష్ణ ఆ ఛాయలకు పోలేదు.చంద్రబాబు నాయుడు సమర్ధుడు కాబట్టి ఆయన మరోపదేళ్ళు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచగలరనిఆశించానని, ఇలా అవుతుందని ఊహించలేదని బాలకృష్ణ ఇప్పుడువాపోతున్నారు.పార్టీని కాపాడుకోడానికి సరైన సమయంలోతన సేవలను పార్టీకి అందించాలని ఆయన ఆలోచిస్తున్నారు.

Recent Stories
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X