వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయరంగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, August 24 2004

హైదరాబాద్‌:బాలకృష్ణ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్యకేసుపైరాజకీయ రంగులు అంటుకుంటున్నాయి.హత్య జరిగిన రోజు బాలకృష్ణ ఇంటికి చంద్రబాబునాయుడు పోలీసు కమిషనర్‌తో కలిసివెళ్ళడం,ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఏ మాత్రం ప్రగతిసాధించకపోవడంతో మీడియాలో పోలీసులకుమ్మక్కుపై అనేక కథనాలు వస్తున్నాయి.దీనితో పోలీసు కమిషనర్‌ ఆర్‌పి సింహ్‌దాదాపు డిఫెన్స్‌లో పడ్డారు. ఈ నేపధ్యంలోఆయన పనిగట్టుకుని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినికలిసి ఈ కేసు గురించి వివరించారు. సమర్ధులైనఅధికారులే దర్యాప్తు చేస్తున్నారని, నిందితులనుత్వరలో పట్టుకోగలమని ఆయన సిఎంకుచెప్పినట్టు తెలుస్తోంది. ఆ రోజు తాను చంద్రబాబునాయుడితో కలిసి సంఘటన స్ధలానికివెళ్ళలేదని, ఇద్దరం కాకతాళీయంగాఒకేసారి అక్కడికి చేరుకున్నానని వివరణఇచ్చుకున్నారు. తమ వివరణతో ముఖ్యమంత్రిసంతృప్తి చెందారో లేదో అన్న విషయంతనకు అనవసరమని, ఎక్కడికిబదిలీ చేసినా అందుకు సిద్ధమని కమిషనర్‌తన సన్నిహితులకు చెప్పారు.

కమిషనర్‌ఆర్‌పి సింహ్‌ ఈ కేసుకు సంబంధించి మొదటిరోజు నుంచి పదే పదే చెబుతున్న విషయంఒకటే. ఇది ప్రొఫెషనల్స్‌ చేసినహత్య అని. ఆరు రోజులుగా ఆయన అదేపాట పాడుతున్నారు.హత్య సంగతి తెలిసిన వెంటనే సంఘటనస్ధలానికి వెళ్ళిన ఆయన కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తాం అని చెప్పకుండాఆయన బాలకృష్ణ కుటుంబసభ్యులకు,ఇంట్లో పనిచేసేవారికి క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టేమాట్లాడారు. మూడు దశాబ్దాల అనుభవంఉన్న సీనియర్‌ పోలీసు అధికారి ఇలా తొందరపడిమాట్లాడి కేసు దర్యాప్తు సరైన దిశలోసాగకుండా చేస్తారని ఎవరూ అనుకోరు.తెలిసో తెలియకో కమిషనర్‌ ఈ పొరపాటుచేశారు. కింది స్ధాయి పోలీసు అధికారులుమాత్రం బాలకృష్ణకు బాగా తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారన్న అనుమానంవ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుచేసిన వారిని విచారించడం జరగదని, అందువల్లబాలకృష్ణను ఆయన కుటుంబసభ్యులనుప్రశ్నించలేదని ఆయన సమర్ధించుకుంటున్నారు.గతంలో డి.మురళీకృష్ణ అనే ఐఎఎస్‌ అధికారితనను హత్య చేయడాని పనిమనిషి ప్రయత్నించాడంటూపోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫిర్యాదీఅని చూడకుండా బంజారాహిల్స్‌ పోలీసులు ఆయననుప్రశ్నించారు.

కమిషనర్‌చెబుతున్న మరో టెక్నికల్‌ డైలాగ్‌ ఇది-సస్పెక్ట్‌ జోన్‌ లో బాలకృష్ణ లేరు. అయినాఅవసరమైతే బాలకృష్ణను ప్రశ్నిస్తామనిఆయన మాట సామెతకు అంటున్నారు.సాధారణంగా ఇటువంటి హత్య కేసుల్లోపోలీసులు పూచిక పుల్లను కూడా వదలకుండాదర్యాప్తు చేస్తారు. ఈ కేసులో వారు అలా చేస్తున్నట్టుకన్పించదు. హంతకులు బాలకృష్ణ ఇంట్లోకిఎలా ప్రవేసి ఉంటారనే విషయాన్ని తెలుసుకోడానికిపోలీసులు అక్కడ చేసిన మాక్‌ ఎక్సర్‌సైజ్‌నవ్వు తెప్పించేదిగా ఉంది. మఫ్టీలో ఉన్నపోలీసులు బాలకృష్ణ ఇంటి గోడ ఎక్కి దూకడంసినిమాల్లో హాస్య సన్నివేశంలా ఉంది.

బాలకృష్ణగార్డు హత్యకేసు దర్యాప్తులో నిమగ్నమైనకింది స్ధాయి అధికారులు ఒక డైరెక్షన్‌లోఆలోచిస్తుండగా కమిషనర్‌ మరో దిశగాఆలోచిస్తున్నారన్నది ఇక్కడ స్పష్టంగా కన్పిస్తున్నఅంశం. గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగినకాల్పుల కేసుకు సంబంధించి డ్రైవరు కనకయ్యనువిచారించిన జూబిలీహిల్స్‌ పోలీసులకు అనేకవిషయాలను సేకరించారు. వాటిని ఆధారంగాచేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేసి ఉంటేహత్య మిస్టరీ ఇప్పటికే విడిపోయి ఉండేదనివారు జనాంతికంగా చెబుతున్నారు.

Recent Stories
చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
సోనియా: మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X