వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనివాళ్ళ పనికాదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలకృష్ణ ఇంట్లో సెక్యూరిటీగార్డు హత్యతో ఆయన ఇంట్లోని పనివారికి సంబంధం లేదని డిఎన్‌ఎపరీక్షల్లో వెల్లడయినట్టు నగర పోలీసు కమిషనర్‌ తాజాప్రకటన చేశారు. దీనితో బాలకృష్ణ కుటుంబసభ్యుల డిఎన్‌ఎను పరీక్షించేఅవకాశాలున్నాయి.

హత్యా స్ధలంలో దొరికిన విజిల్‌,హతుడైన గార్డు చేతి గోళ్లలో ఇరుక్కున్న వెంట్రుకలుదర్యాప్తులో కీలకంగా ఉన్నాయి. విజిల్‌ మీద ఉమ్మి, ఈ వెంట్రుకలుఒకరివేనని డిఎన్‌ఎ పరీక్షల్లో వెల్లడయింది. హత్యకేసు మిస్టరీత్వరలో వీడిపోనున్నట్టు పోలీసులు నమ్మకంతో ఉన్నారు.

బాలకృష్ణ వంటమనిషిఆంజనేయులును నిన్న పోలీసు ఉన్నతాధికారులు రెండు గంటలసేపు ప్రశ్నించారు. హత్య జరిగిన స్ధలానికి పక్కనే సర్వెంటుక్వార్టర్‌లో హత్య జరిగిన సమయంలో నిద్రిస్తున్న ఆంజనేయులుకిఆత్మరక్షణ కోసం గార్డు వేసిన కేకలు ఎందుకు విన్పించలేదనిపోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఆంజనేయులు నుంచి ముఖ్యమైనసమాచారం ఏదీ లభించకపోవడంతో పోలీసులు ఆయనను ఇంటికిపంపేశారు.

ఈ కేసు దర్యాప్తును పోలీసులునీరుగారుస్తున్నారని విమర్శలు రావడంతో పోలీసులుకేసును సీరియస్‌గా తీసుకున్నారు. బాలకృష్ణ కుటుంబసభ్యులుటిడిపి, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉండడంతో కేసును క్షుణ్ణంగాపరిశోధించాలన్న డిమాండ్‌ రాజకీయ వర్గాల నుంచి పెద్దగారాలేదు. ప్రతిపక్ష టిడిపి నాయకులు ఈకేసు దర్యాప్తులోపోలీసుల వైఫల్యంపై ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం గమనార్హం.

Recent Stories
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X