• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కప్పల తక్కెడ

By Staff
|
Y S Rajashekar Reddyహైదరాబాద్‌: కాపురం చేసేకళ కాళ్ళపారాణి దగ్గరే తెలుస్తుందంటారు. రాష్ట్రంలోకాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చివందరోజులు దాటిపోయినాదానికొక దిశ ఉన్నట్టు కన్పించడం లేదు. రైతులకు ఉచిత విద్యుత్‌ఇందుకు మంచి ఉదాహరణ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ప్రభుత్వం పదకొండు వందల కోట్ల విద్యుత్‌ బకాయిలను రద్దుచేసింది.

చిన్నాపెద్దా అని లేకుండా రైతులందరికీ ఉచిత విద్యుత్‌ఇస్తామని వెనుకా ముందు ఆలోచించకుండా కాంగ్రెస్‌ ఎన్నికలవాగ్దానం చేసింది. ఇప్పుడీ వాగ్దానం ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి పీకల మీదకు వచ్చింది. ప్రపంచబ్యాంకు తాజానిర్దేశాల మేరకు ఉచిత విద్యుత్‌ను చిన్నరైతులకు మాత్రమేవర్తింపచేయవలసి ఉంటుంది. అయినా నిజంగా చిన్న రైతులెవరోకనుక్కోవడం ఆచరణలో కష్టమవుతుంది. విద్యుత్‌నుఉచితంగా పొందేందుకు పొలాన్ని కుటుంబ సభ్యులందరి పేరిట జిపిఎలుచేసుకునే అవకాశం ఉంది.

ఉచిత విద్యుత్‌పై రాష్ట్రకాంగ్రెస్‌ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు నిన్న ఈ అంశంపైజరిగిన అఖిల పక్ష సమావేశంలో వెల్లడయింది. ఉచిత విద్యుత్‌నువైఎస్‌ పథకంగా జనం అర్ధం చేసుకున్నారు కానీ కాంగ్రెస్‌పథకం అనుకోలేదని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నిన్నటిసమావేశంలో గమ్మత్తుగా మాట్లాడారు.

అవకాశందొరికినప్పుడల్లా ఆయన వైఎస్‌ మీద కసి తీర్చుకునేలామాట్లాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు కాంగ్రెస్‌అనైక్యతకు అద్దం పడుతున్నాయి. వైఎస్‌ వాలకం చూస్తేరెండేళ్ళు కూడా పరిపాలించే కళ కన్పించడం లేదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఓడిపోయిన వాళ్ళు ఆ బాధతో ఏదైనామాట్లాడుతారు కాబట్టి వాటిని పట్టించుకోనవసరం లేదు.

శాంతి భద్రతల విషయంలోకాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి.నీటిపారుదల రంగానికి అధిక నిధులు కేటాయించినాటెండర్లను ఏరికోరి తొమ్మిది కంపెనీలకే ఇవ్వడంవివాదాస్పదమయింది. ఇందులో కొన్ని వందల కోట్లు చేతులుమారాయన్న ఆరోపణలు వచ్చాయి.

ఇక నక్సలైట్లతో చర్చలుఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.ముద్దముద్దగా మాట్లాడే హోంమంత్రి జానారెడ్డి చర్చలవిషయంలో సుదీర్ఘ ఆలోచన చేసినట్టు కన్పించదు.

కన్పించిన సోకాల్డ్‌మేధావులందరినీ పిలిచి ఆయన నక్సలైట్ల సమస్యపై పోసుకోలుకబుర్లు వింటున్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు ధోరణి సరేసరి. తిరుమలవెయ్యికాళ్ళ మంటపం విషయంలో చిన జీయరు స్వామి ఒక హెచ్చరికచేయగానే ఇంత పెద్ద మంత్రి గారు భయపడిపోయి ఆయనఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళ వద్ద కూర్చుని ఆయనడిమాండును ప్రభుత్వం అంగీకరించిందని విన్నవించుకున్నారు.

దీనిమీదఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్‌వెనుకడుగు వేసి ప్రభుత్వం జీయరు స్వామికి హామీ ఇవ్వలేదనిచెప్పారు. ఎమ్మెస్‌ హామీ ఇచ్చిన విషయం ప్రస్తావించగా ఆయన మాటలుపట్టించుకోవలసిన అవసరం లేదని నవ్వుతూ చెప్పారు. ఇదాప్రభుత్వమంటే? విధాన నిర్ణయాలపై మంత్రులకు ఉమ్మడిబాధ్యత ఉండదా?

Recent Stories

మూడోపవర్‌ఫుల్‌ లేడీ

టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి

బాలకృష్ణ ఇంటిదొంగలేనా?

మంద భాగ్యనగరం

తెలంగాణకు ఎర్ర జెండా

ఛానళ్ళా? చేపల చెరువులా?

టిఆర్‌ఎస్‌లో ముసలం?

వార్‌ బహుముఖ విస్తరణ

ఎమ్యెల్యేకుకోటి!

ప్రత్యేక వ్యూహం!

వైఎస్‌ అసహనం

కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే

తెలుగు భాష దుస్ధితి

పాపం వైఎస్‌!

ఇద్దరు

చైతన్య కిడ్నాప్‌ వెనుక...

ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు

తెలంగాణకు ఎర్ర జెండా

ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు

మొగిలిచెర్లలోవార్‌

సిద్దిపేట సీను

ఆంధ్రపైజయ చిందులు

మణికుమారికిసవతిపోరు!

కొడుకు రాజకీయంపై వైయస్‌

సైకిల్‌దిగిన బాబూఖాన్‌

సమైక్యనినాదం ఊపు

తిరగబడినరాత

బాబుపైబాలయ్య అసంతృప్తి!

సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X