వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో సందడి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, April 27 2004

హైదరాబాద్‌:రెండో విడత పోలింగ్‌ తర్వాత తెలుగుదేశం శిబిరం నిస్తేజం కాగాకాంగ్రెస్‌ శిబిరంలో తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ధిపై చర్చలుజరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే వైఎస్‌ముఖ్యమంత్రి అవుతారనడంలో ఎవరికీ సందేహాలు లేవు.ఎందుకైనా మంచిదని వైఎస్‌ వర్గం ఢిల్లీలో పెద్ద ఎత్తునలాబీయింగ్‌ ప్రారంభించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాకి మొహం చూపించలేకపోతున్నారు.

బయటపడకపోయినాఈ పదవి ఆశిస్తున్న డి.శ్రీనివాస్‌ నిన్నటి నుంచి గాంధీభవన్‌ పట్టుకునివేళ్ళాడుతున్నారు. ఆయన పరిధిలో ఆయన ఢిల్లీ పెద్దలనుప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ఎన్నికల కమిటీ ఉపాధ్యక్షుడుగా విసు సంస్ధల అధిపతి సిసిరెడ్డిని వైఎస్‌ నియమించుకోవడం, ఆయన కొన్ని టీవీ ఛానల్స్‌ లోవైఎస్‌ భజన చేస్తుండడంతో కడుపు మండిన డిఎస్‌ తనమనుషులైన రాపోలు ఆనందభాస్కర్‌, శారదలను పిసిసిమీడియా ఇంచార్జిలుగా నియమిస్తూ నిన్న ఆఘమేఘాల మీద ఉత్తర్వులుజారీ చేశారు. కాంగ్రెస్‌ కు సంపూర్ణ మెజారిటీ రాక టిఆర్‌ ఎస్‌మద్దతు తీసుకోవలసివస్తే డిఎస్‌ సిఎం అయ్యే అవకాశాలుమెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే చంద్రశేఖరరావు వైఎస్‌కంటే డిఎస్‌ వైపు సహజంగా మొగ్గుచూపుతారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆదరణ లభించడానికి చంద్రబాబు నాయుడిపై ప్రజలకు ఉన్నవ్యతిరేకతే కారణం కానీ వైఎస్‌ చరిష్మ కాదని డి. శ్రీనివాస్‌ఇప్పటికే ఆజాద్‌కు బ్రీఫింగ్‌ ఇచ్చినట్టు ఆయన శిబిరంలో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్‌ కుమెజారిటీ వస్తే ముఖ్యమంత్రి పదవికి కనీసం అరడజను మందిపోటీ పడతారు. ఎంపీలు కూడా సిఎం కావచ్చు కాబట్టినేదురుమల్లి జనార్ధనరెడ్డి, రేణుకాచౌదరి,జైపాల్‌రెడ్డిలు కూడా రేసులో ఉంటారు.

ప్రజలురాజశేఖరరెడ్డిని బాగా ఆదరించినప్పటికీ కాంగ్రెస్‌ఎమ్మెల్యేలలో ఎంత మంది ఆయనకు మద్దతు ఇస్తారన్నదిఅస్పష్టంగా ఉంది. పాతికేళ్ళుగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలోశత్రువులను పెంచుకుంటూ వచ్చారు. ఆయనను ముఖ్యమంత్రినికానివ్వకూడదన్న ఎజెండా వస్తే ఆయన వ్యతిరేక గ్రూపులన్నీఏకమవుతాయి. ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెండుమూడు రోజులవరకు కాంగ్రెస్‌ పరిణామాలు రసవత్తరంగాఉంటాయి. హైదరాబాద్‌- ఢిల్లీ విమానాలు రద్దీ అవుతాయి.కాంగ్రెస్‌ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే వీలుంటుంది కాబట్టే ఈఉత్కంఠ అంతా.

  • ఎక్కడికాంగ్రెస్‌ అక్కడే..
  • ఎక్కడికాంగ్రెస్‌ అక్కడే..
  • ఇద్దరు
  • రాజశేఖరరెడ్డినష్టజాతకం!
  • హస్తవ్యస్ధం
  • తారల ప్రభావం నిల్‌!
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X