వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్‌ఎదురుచూపు దేనికి సంకేతం?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Wednesday, Aug 11 2004

డిఎస్‌ఎదురుచూపు దేనికి సంకేతం?

హైదరాబాద్‌:పిసిసి అధ్యక్షుడు,రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ఇప్పుడేం చేస్తున్నారు?కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ల ఎన్నికల పొత్తులో కీలకపాత్ర వహించిన ఆయన ఇప్పుడు రెండుపార్టీల మధ్య అగాధం పెరిగిన నేపధ్యంలోఆయనకు మళ్ళీ మరో ప్రత్యేక పాత్ర రానుందా?

ముఖ్యమంత్రిపదవి ఆశించి భంగపడిన శ్రీనివాస్‌ ఇప్పుడురాష్ట్ర కేబినెట్‌లో ఉన్నప్పటికీ ఆయనప్రభుత్వంలో తాను భాగస్వామిని కానట్టేవ్యవహరిస్తున్నారు. పిసిసి అధ్యక్షబాధ్యతల్లోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతున్నారు.పార్టీ వ్యవస్ధాగత మార్పులు జరిగేవరకుఇక్కడ పిసిసి అధ్యక్షుడిని మార్చబోమనిఅధిష్టానవర్గం ప్రకటించడంతో ఆయనకురిలీఫ్‌ దొరికింది. రాజశేఖరరెడ్డి నాయకత్వంలోనిప్రభుత్వ పోకడలను ఆయన సన్నిహితులవద్ద నిశితంగా విమర్శిస్తున్నారు. ఆయనసచివాలయానికి ఎక్కువగా వెళ్ళడంలేదు. తన శాఖను పట్టించుకోవడంలేదు.

మరోవైపు రాజశేఖరరెడ్డి కోటరీలో రఘువీరారెడ్డి,జానారెడ్డి వంటి ముగ్గురు నలుగురుమంత్రులు చక్రం తిప్పుతున్నారు. మంత్రులకుకేటాయించకుండా ముఖ్యమంత్రి వద్దేమిగిలిపోయిన వైద్య ఆరోగ్య, విద్యుత్‌వంటి శాఖల బాధ్యతను అనధికారికంగారఘువీరారెడ్డి చూస్తున్నారు.

ముఖ్యమంత్రిపదవి దక్కినట్టు దక్కి చేజారిపోవడంతోఆశాభంగం చెందిన డిఎస్‌ పూర్తిగా అధిష్టానవర్గంమీద బాధ్యత వేసి కూర్చున్నారు.తనకు మంత్రి పదవి ఇష్టం లేదని చెప్పినాసోనియా ఆదేశం మేరకు అంగీకరించాననిఆయన ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అలాగేపిసిసి అధ్యక్షుడిగా తాను కొనసాగాలోలేదో అధిష్టానవర్గమే నిర్ణయిస్తుందనిఆయన స్పష్టం చేశారు. తనకు మంత్రిపదవికంటే పిసిసి అధ్యక్ష పదవే ఎక్కువసంతృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పారు.

టిఆర్‌ఎస్‌తోకాంగ్రెస్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడువైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఇప్పుడున్నంతబలం లేదు. పొత్తు విషయంలో కాంగ్రెస్‌పూర్తిగా డిఎస్‌ సలహాల మీదనే ఆధారపడింది.తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద బలం లేకపోయినాడిఎస్‌ ఎక్కువ చేసి చెప్పారని రాజశేఖరరెడ్డివర్గం ఎన్నికల తర్వాత అధిష్టానానికిఫిర్యాదు చేసింది. పిసిసి మాజీ అధ్యక్షుడుసత్యనారాయణ రావు ఎంత చిన్న శాఖఇచ్చినా హాయిగా పనిచేసుకుంటున్నప్పుడుమంత్రి పదవి కంటే పిసిసి అధ్యక్షపదవే సంతృప్తిగా ఉందని శ్రీనివాస్‌ ఎందుకుఅనుకుంటున్నారు? ఆయన మంత్రి పదవివద్దనుకుంటే పార్టీ పదవిలో ఆయననుకొనసాగిస్తారా? సోనియాగాంధీ తెలంగాణవిషయంలో తనకు ముఖాముఖి ఒక హామీ ఇచ్చారనిచంద్రశేఖరరావు బాహాటంగా చెబుతున్నారు.వైఎస్‌తో ఏవైనా ఇబ్బందులు వస్తే తదుపరిముఖ్యమంత్రి నువ్వేనన్నట్టు సోనియాగాంధీమాట్లాడినట్టు డిఎస్‌ అభిప్రాయం. మహారాష్ట్రఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకమార్పులు వచ్చే అవకాశం ఉంది.

  • వైఎస్‌ వారసత్వం
  • ఇద్దరూఇద్దరే!
  • సీమటపాకాయ

  • మన్మోహనం

  • మీనాఎందుకు?
  • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
  • గులాబీపోరు!
  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X