• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిత్ర హింస

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, August 27 2004

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడుహయాంలో ఆయన గారాబం చేసిన సినిమా పరిశ్రమకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకుని ఏళ్లు గడిచినా తిరిగి చెల్లించనిరాష్ట్రంలోని నూటయభై సినిమా థియేటర్ల యజమానుల చెవులు పిండిబకాయిలను వసూలు చేయవలసిందిగా వైఎస్‌రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రుణాల విషయంలో థియేటర్లయజమానులను వత్తిడి చేయవద్దని గతంలో చంద్రబాబునాయుడు చెప్పడంతో ఎఫ్‌డిసి అధికారులుమిన్నకుండిపోయారు. కొందరు సినిమా ప్రముఖుల సిఫార్సుతోచంద్రబాబు నాయుడు ఉదారంగా వ్యవహరించారు. ఆరుశాతంవడ్డీకి ఈ రుణాలు ఇచ్చినా అనేక ఏళ్ళు గడిచిపోవడంతోచక్రవడ్డీలు కలిసి ఈ మొత్తం తడిసి మోపెడయింది. వన్‌టైసెటిల్‌మెంటుకు ఇప్పుడు అవకాశంకల్పించారు. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి కొందరు యజమానులుమాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఎక్కువమందిచేతులెత్తేయడానికి ప్రయత్నిస్తున్నారు.

టీవీల ప్రభావంతో థియేటర్లకువచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్నదని, ఈ కారణంగానష్టాల్లో ఉన్న థియేటర్లకు రుణాలను మాఫీ చేయాలని థియేటర్‌యాజమాన్యాలు తమ వాదన విన్పిస్తున్నాయి.

ఎన్నికల ముందు సినిమాపరిశ్రమ కట్టకట్టుకుని చంద్రబాబు నాయుడికి మద్దతుపలికడంతో పరిశ్రమలోని ఏ శాఖనూ విడిచిపెట్టరాదని వైఎస్‌ కోటరీనిర్ణయించుకుందని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు.రాజకీయాలకు, ఎన్నికలకు థియేటర్‌ యజమానులకుఎటువంటి సంబంధం ఉండదని, సినిమా నటులు కొద్దో గొప్పో ఓటర్లనుప్రభావితం చేయగలరేమో గానీ థియేటర్లు ఆ పని చేయలేవని, తమపైకక్ష పెట్టుకోవడం అర్ధరహితమని వీరు వాపోతున్నారు.

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)నాయకులు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి తమ కార్యాలయానికిజూబిలీహిల్స్‌లో రెండెకరాలు కావాలని వినతి పత్రంసమర్పించినప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడి పంపించారు.ఆనాడు వెళ్ళిన ప్రతినిధి బృందంలో అక్కినేని, చిరంజీవి, మురళీమోహన్‌ఇంకా ఎందరో హీరోలు ఉన్నారు.

Recent Stories

కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?

రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట

పరిటాలకథ

సోనియా: మూడోపవర్‌ఫుల్‌ లేడీ

టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి

బాలకృష్ణ ఇంటిదొంగలేనా?

మంద భాగ్యనగరం

తెలంగాణకు ఎర్ర జెండా

ఛానళ్ళా? చేపల చెరువులా?

టిఆర్‌ఎస్‌లో ముసలం?

వార్‌ బహుముఖ విస్తరణ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X