వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీమీద వైఎస్‌ దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews
YSRహైదరాబాద్‌:ఆయనది పంచెకట్టు, పల్లెబాట. కానీ ఆయనకు ఆయనఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మీద ఇంత ఆసక్తి ఉందా అన్ని ఐటీ రంగదిగ్గజాలు ఆశ్చర్యపోతున్నారు.

సెప్టెంబర్‌రెండో తేదీన బెంగుళూరు వస్తున్నానని, ఆ సందర్భంగా ఐటిరంగ ప్రముఖులైన మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాననిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇన్ఫోసిస్‌నారాయణ మూర్తి, విప్రోప్రేంజీ తదితరులకు లేఖలు రాశారు.

ఎల్లుండి సిఎంబెంగుళూరులో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ఇండియన్‌ ఇండ్రస్టీసదస్సులో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంతర్వాతఆయన నారాయణ మూర్తి, అజీం ప్రేంజీలతో వివిడిగా సమావేశమైహైదరాబాద్‌లోనే గాక రాష్ట్రంలోని ఇతరనగరాల్లో సాఫ్ట్‌వేర్‌పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వంతీసుకుంటున్నచర్యలను వివరించనున్నారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోవడంతో కొత్తప్రభుత్వం ఐటికి ప్రోత్సాహకాలు కొనసాగించదేమోనన్నఅనుమానంతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలుబెంగుళూరుకు, చెన్నైకి తరలిపోతాయన్న వూహాగానాలనేపధ్యంలో రాజశేఖరరెడ్డి కార్యాలయం అన్ని జాగ్రత్తలుతీసుకుంటోంది.

తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లోమరింత విస్తరింపజేయవలసిందిగా బెంగుళూరులోని ప్రముఖసాఫ్ట్‌వేర్‌ సంస్ధలను ముఖ్యమంత్రి కోరనున్నారు. వారికికావలసిన ప్రాధమిక సదుపాయాలను రాయితీలను గురించిఆయన ఐటీ దిగ్గజాలను అడిగి తెలుసుకోనున్నారు.

ముఖ్యమంత్రి పదవిలోకివచ్చిన వెంటనే రాజశేఖరరెడ్డి ముంబాయి వెళ్ళి ప్రముఖపారిశ్రామిక వేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిఅవకాశాల గురించి వివరించిన సంగతి తెలిసిందే.

Recent Stories
సత్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X