ఈయన సినిమా పోలీసు కాదు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Tuesday, June 08 2004
హైదరాబాద్: బాలకృష్ణ కేసులో నగరపోలీసు కమిషనర్ ఆర్‌పి సింహ్ చూపిన చొరవ, చాకచక్యంనేరపరిశోధన చరిత్రలో చెప్పుకోదగినవి. రాజకీయకుటుంబానికి చెందిన ఒక ప్రముఖ సినిమా హీరో నిందితుడిగా ఉన్నకేసు విషయంలో పోలీసు అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్ళురావడం సహజం.
అయినా సంఘటన జరిగినప్పటి నుంచిఇప్పటివరకు నగర పోలీసులు ఈ కేసుపై క్షుణ్ణంగాదర్యాప్తు జరిపారు. పారదర్శకత కూడా ప్రదర్శించారు. కేర్‌ఆస్పత్రిలో బాలకృష్ణను అరెస్టు చేసి అత్యంత రహస్యగా మెజ్రిస్టేట్‌వద్ద హాజరు పరచడం, మీడియాకుతెలియనివ్వకపోవడంపై ఆర్‌పి సింహ్ మరుసటి రోజేమీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పుకున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాఉండగా ఈ సంఘటన జరిగి ఉంటే పోలీసు దర్యాప్తు ఏ విధంగాఉండేదన్న చర్చ రాజకీయవర్గాల్లోను, సినిమాపరిశ్రమలోను ఇప్పుడు జరుగుతోంది. పోలీసులు ఏ కేసునైనానీరుగార్చే అవకాశం ఉంది.
పోలీసు కమిషనర్ ఈ కేసు విషయంలోకఠినంగా వ్యవహరించడానికి అనేక కారణాలు ఉన్నాయి.చంద్రబాబు నాయుడి హయాంలో ఆయన మనుషులుగావ్యవహరించిన సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను అప్రధానపోస్టుల్లోకి బదిలీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రబాబునాయుడు హయాంలో ఆర్‌పి సింహ్ ఆర్టీసీ ఎండీ, నగరపోలీసుకమిషనర్ వంటి ప్రతిష్టాత్మక పోస్టింగులు పొందారు.
చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకమైన ఫేవర్లుచేయకపోయినా ఆయనకు ఇష్టమైన అధికారిగా సింహ్‌కుపేరుంది. అందువల్ల బాలకృష్ణ కేసులో ఏ మాత్రం నిర్లక్ష్యంగావ్యవహరించినా తన నిజాయితీని రాజశేఖరరెడ్డినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శంకించే ప్రమాదంఉన్నందున కమిషనర్ ఈ కేసు విషయంలో అతి జాగ్రత్తలుతీసుకున్నారు.
ఈ మెడికో లీగల్ కేసును ఆలస్యంగాపోలీసుల దృష్టికి తెచ్చినందుకు కేర్, అపోలో ఆస్పత్రులకు ఆయనషోకాజ్ నోటీసులు జారీ చేయడం, సాక్షులు చెప్పే విషయాల్లోసారూప్యత ఉండేలా చూడడం ఆయన తీసుకున్న అతి జాగ్రత్తలలోకొన్ని.
చట్టందృష్టిలో అందరూ సమానమేనన్న మెసేజిని కమిషనర్ జనానికిఅందజేయగలిగారు.
ఇటీవలికథనాలు
- ప్రజల దేవుడు
- విశ్లేషణ..సగటు ఓటరు విజయం
- రేపటి సంగతి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- వ్యతిరేక గాలి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications