• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Wednesday, July 07 2004

Sachin Tendulkarవయసుపెరుగుతున్న కొద్దీ బాధ్యతల్లోమార్పు మినహా, తన ఆటతీరులో మార్పేమీలేదని ప్రపంచ క్రికెట్‌ రారాజు సచిన్‌టెండూల్కర్‌ మరోమారుస్పష్టంచేశాడు. యువకెరటాలుస్వెగ్‌, యువరాజ్‌ సింగ్‌, కైఫ్‌లుదూసుకొచ్చిన నేపథ్యంలో సచిన్‌టెండూల్కర్‌ దూకుడు తగ్గిందన్నిఇటీవల వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. అయితే,వాటిని సచిన్‌ కొట్టిపారేస్తున్నాడు.త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్‌కు సన్నద్దమవుతోన్న ఈబ్యాటింగ్‌ దిగ్గజం పీటీఐ ప్రతినిధికిప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాబోయేకాలంలో భారత జట్టు స్థితి, కొత్తఆటగాళ్ళ ఆటతీరు, కెప్టెన్సీ చేపట్టేఅవకాశాలు..వంటి అనేక అంశాలపై సచిన్‌ముచ్చటించాడు. అందులోని ముఖ్యాంశాలు..

ఇటీవలికాలంలో మీ ఆటతీరులో మార్పు రావడానికివయసుపైబడుతుండడమేకారణమా?

లేదు. ఆ వాదనలో నిజం లేదు.పదిహేనుళ్ళుగా అంతర్జాతీయక్రికెట్‌ ఆడుతున్నాను. ఇప్పుడుదూకుడు తగ్గితే తగ్గవచ్చు, కానీఆటతీరులో మార్పులేదు. సీనియారిటీపెరుగుతున్న కొద్దీ పాత్రమారుతుంది. అంతే. అది ఇతరులకునేను తగ్గినట్లు కన్పించొచ్చు. ఇప్పటికీనా సగటు చూస్తే, ప్రపంచంలో స్ట్రైక్‌రేట్‌ అధికంగా ఉన్న వారిలో నేనుఒకడిగా ఉన్నాను. కాబట్టి నా ఆటతీరులోమౌళికంగా మార్పు ఉందని అనుకోను.కాకపోతే, పరుగులు రాబట్టేవిధానంలో చాలా మార్పులు వచ్చాయి. వాటినిఆచరణలో పెడుతున్నాను.

భారత్‌నెంబర్‌ వన్‌జట్టుగా ఎదగడానికిఆటగాళ్ళ ఫిట్‌నెస్‌ సమస్యఅడ్డంకిగా మారిందనే వాదనపై మీకామెంట్‌

అర్ధరహితమైన వాదన అది.ఇప్పటివరకు మనం చూసినఫిట్టెస్‌ జట్టు (భారత్‌లో) ఇదే. వెనుకటికాలంతో పోల్చితే, ఇప్పుడు మన జట్టుఅధికంగా క్రికెట్‌ ఆడుతోంది సగటునా.అధికంగా పర్యటనలు చేస్తున్నాం.ప్రయాణాలు, పర్యటనలు ఇన్నీ ఉన్నప్పుడుసహజంగానే మన శరీరాలు కొంచెంబద్దకిస్తాయి. కానీ, ఇప్పుడు జట్టులో అందరూఇంత ఫిట్‌గా ఉన్నారంటే, ట్రెయినర్‌,ఫిజియో థెరపిస్ట్‌, కోచ్‌ల ప్రతిభే అనిచెప్పవచ్చు.

విదేశీకోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌లు నిజంగాఅవసరమా?

దేనికైనాఫలితాలే గీటురాయి. వారి (విదేశీ కోచ్‌,ఫిజియోథెరపిస్ట్‌, ।టైనర్‌) వల్లమనం పొందిన, పొందుతోన్న లబ్ధి ఎమిటోతెలుస్తునే ఉంది కదా! గతరెండేళ్లుగా మనం సాధిస్తోన్నవిజయాల వెనుక వారి పాత్ర కూడాకాదనలేనిది.

వివిఎస్‌ లక్ష్మణ్‌, సెవ్వాగ్‌లు వచ్చాక, మీపైభారం తగ్గినట్లు కన్పిస్తోంది?

నా భాద్యతల్లో ఎలాంటి మార్పులేదు.చాలామంది ఒక విషయాన్ని గ్రహించడంలేదు. ఒకసారి ఒకరు రాణిస్తారు.మరోసారి కొందరు. జట్టులోని ఉన్నప్రతివారు అన్ని సందర్భాల్లోనూ వందపరుగులు చేయలేరు. ఇతరులుఎలా ఆడుతున్నారో అని నేను ఏనాడూపట్టించుకోను. దేశంకోసం, జట్టు గెలుపుకోసం ఆడడమే తొలి నుంచి నా లక్ష్యం,బాధ్యత. అందులో ఏనాడూమార్పులేదు. కాకపోతే, ఒకసారిపరుగులు సాధించడంలో విజయంసాధిస్తాం. కొన్నిసార్లువిఫలమవుతాం.

సాధారణంగాఏదైనా మ్యాచ్‌ ప్రారంభానికి ముందుఎలాంటి ప్రణాళికలు సిద్దంచేసుకుంటారు?

ముందుగా ఇలా ఆడాలి, అలా ఆడాలి అనిఅనుకోని బరిలోకి దిగి, దాన్ని ఆచరణలో పెట్టేపద్దతి కాదు నాది. అప్పటికప్పుడు నాఇన్‌స్టింక్ట్‌ని బట్టి ఆడుతాను. అదేసరియైన పద్దతి. ఒక బంతిని బాదాలన్నా,వదిలేయాలన్నా నా ఇన్‌స్టింక్ట్‌ని బట్టే వెళుతాను.

కెప్టెన్సీనిమళ్ళే చేపట్టే అవకాశం ఉందా?

ప్రస్తుతం నేను దాని గురించేఆలోచించడం లేదు. కెప్టెన్‌ అయినా, జట్టులోసభ్యుడైనా పెద్ద తేడా ఏమీ లేదు.గెలుపే ముఖ్యం. గంగూలీ కెప్టెన్సీ బాగుందికదా!

మీ దృష్టిలో ఇప్పుడున్న మంచిబ్యాట్స్‌మెన్‌ ఎవరు?

భారత్‌లోనైతే,వీరూ (సెవ్హాగ్‌), గంగూలీ, కైఫ్‌, ద్రావిడ్‌,యువరాజ్‌, లక్ష్మణ్‌ల ఆటను నేనుబాగా ఎంజాయ్‌ చేస్తాను.అంతర్జాతీయంగా చాలా మంది ఉన్నారు. హోంపేజి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more