హైదరాబాద్ నుంచి విజయశాంతి
హైదరాబాద్: సినీనటి విజయశాంతికి బిజెపిహౖెెదరాబాద్ లోక సభ స్ధానాన్ని కేటాయించింది. బిజెపి నిర్ణయం వెనుక ఉద్దేశమేమిటో స్పష్టం కావడం లేదు. ఎటు ఓడిపోయే సీటును ఆమెకు ఎందుకు కేటాయించారో తెలియడం లేదు. నగరంలో అయితే తెలంగాణ , తెలంగాణెతర అనే సమస్య వచ్చే సమస్య లేదు కాబట్టి ఇలా చేశారని భావిస్తున్నారు.
బిజెపి అగ్రనాయకత్వం ఒక దశలో సినీనటి నగ్మానుహైదరాబాద్‌బరిలో నిలపాలని ప్రయత్నించింది. ఆ తర్వాత విజయశాంతి సరయిన అభ్యర్ధి అని భావించింది. ఇక్కడ నుండి మజ్లిసు అభ్యర్ధిగా ఆసదుద్దిన ఒవయిసీ పోటీ చేయబోతున్నారు. మజ్లిసు తరఫున అనామకుడు నిలబడినా గెలుస్తాడు. అటువంటిది ఒవయిసీ నిలబడితే ప్రత్యర్ధికి అడ్రసు ఉండదు.












Click it and Unblock the Notifications
