వైఎస్ అసహనం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Sunday, August 08 2004
హైదరాబాద్: సాధారణంగానిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు అనాలోచిత మాటలు వస్తాయి.అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సాధ్యమైనంతజాగ్రత్తగా మాట్లాడుతారు. ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి వైఖరి ఇందుకు విరుద్ధంగా కన్పిస్తున్నది.చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా మెలిగిన వారికిరాజశేఖరరెడ్డి అవకాశం దొరికినప్పుడల్లామొట్టికాయలు వేస్తున్నారు.
నిన్న నిరుపేద హృద్రోగ బాలలకునాయకత్వం వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన మాదిగ సంఘంనాయకుడు మందకృష్ణ మాదిగతో ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రిబెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. మందకృష్ణ గతంలోచంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేవారు. గుండెజబ్బులున్న పేదల గురించి చంద్రబాబు నాయుడు అధికారంలోఉండగా నీకు గుర్తు రాలేదా? అని వైఎస్ తనను బెదిరించారనిఆయన విలేకరులకు చెప్పారు.
చంద్రబాబు నాయుడి సహాయసహకారాలతో ప్రారంభమైన ఒక దిన పత్రిక ఢిల్లీ విలేకరితోకూడా వైఎస్ నిన్న అసహనంగా మాట్లాడారు. నా మీదవ్యతిరేక వార్తలు అదే పనిగా రాస్తున్నారు.
మీకు ప్రభుత్వప్రకటనలు ఎలా వస్తాయో చూస్తాను అని ఆయన బెదిరించినట్టు వార్తవచ్చింది. నాయకులు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి కానీ ప్రతి చిన్న విషయానికిఅసహనం ప్రదర్శించకూడదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిఇంకా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది.
Recent Stories
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications