• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై మళ్ళీదోబూచులాట!

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Tuesday, December 21 2004

హైదరాబాద్‌:ఢిల్లీలో సూటు, బూటుతో అనేకకార్యక్రమాల్లో పాల్గొని, సోనియాగాంధీని దర్శించుకుని తిరిగివచ్చారు. ఆయన పైకి నవ్వుతూ కన్పించినప్పటికీసోనియాగాంధీ నీటిపారుదల ప్రాజెక్టులు, అవినీతి ఆరోపణలవిషయంలో జాగ్రత్తగాఉండవలసిందిగా ఆయనను హెచ్చరించిపంపినట్టు ఎఐసిసి వర్గాలు ద్వారాతెలుస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టులటెండర్ల విషయంలో వైఎస్‌ ప్రభుత్వంతొందరపాటుతో వ్యవహరించి అభాసు పాలైనవిషయాన్ని వైఎస్‌ వైరి వర్గాలు సోనియాగాంధీచెవిలో వేశారు.

ప్రధానమైనఈ విషయాన్ని పక్క దోవ పట్టించేందుకురాజశేఖరరెడ్డి తెలంగాణ తెరాస,చంద్రశేఖరరావు సొంత సొత్తుకాదు అని వ్యాఖ్యానించి దుమారం రేపారు.తెలంగాణ ఏర్పాటుకు రెండో ఎస్సార్సీయేశరణ్యమన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణఅభివృద్ధి గురించి మాట్లాడడం, తెలంగాణరాష్ట్రం ఏర్పాటు విషయంలో కెసిఆర్‌ మాటలు నమ్మవద్దని ప్రకటించడంటిఆర్‌ఎస్‌ వర్గాలను విస్మయ పరిచింది. సిఎంప్రకటనను తెలంగాణకు చెందినపిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు,రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్‌ సమర్ధించడం గమనార్హం.

రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు తెలంగాణరాష్ట్రం ఇప్పటికిప్పుడు ఏర్పాటుకాకపోయినా ఎప్పటికైనా ప్రత్యేకరాష్ట్రం కావడం ఖాయం అని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌చెబుతున్నంతవేగంగా తెలంగాణ ఏర్పాటయ్యేఅవకాశాలు కన్పించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెస్‌ ప్రకటనేవాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు కన్పిస్తోంది.తెలంగాణకు చెందినకేశవరావును పిసిసి అధ్యక్షుడిగానియమించడమే ఇప్పట్లో తెలంగాణరాష్ట్రం ఏర్పడదనడానికి స్పష్టమైనసంకేతం. కెసిఆర్‌ వీటన్నిటినీపట్టించుకోకుండా డిసెంబర్‌లోగాతెలంగాణ, మార్చిలోగా తెలంగాణ అనిప్రకటిస్తున్నారు. ఆయన సోనియాగాంధీతో ప్రతి సారిఏమి మాట్లాడి వస్తున్నారు? సోనియా ఆయనడిమాండ్‌కు చూద్దాం చేద్దామనిప్రతిస్పందిస్తున్నారా? లేదా నిర్ధిష్టమైనహామీ ఇస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్దమిస్టరీగా ఉంది. అదే విధంగారాజశేఖరరెడ్డి తెలంగాణ విషయంలో సోనియాకు ఫీడ్‌చేస్తున్న సమాచారంఏమిటన్నది కూడా అతి గోప్యమే. అయినా లోగుట్టునుగ్రహించడం అంత కష్టం కాదు.కొంతకాలం గడిపేసి ప్రజల మూడ్‌ ఎలా ఉందోగ్రహించి అవసరమైతేనే తెలంగాణరాష్ట్రం ఏర్పాటు గురించి లాంఛనంగాప్రకటిస్తారని తెలుస్తోంది.తెలంగాణను విడదీయవలసి వస్తే ఆఘనతను సోనియాగాంధీ స్వయంగా తీసుకోవాలనుకుంటున్నారు. తెలంగాణఏర్పాటు క్రెడిట్‌ కెసిఆర్‌కు ఇవ్వరాదనేవిషయాన్ని వైఎస్‌ సోనియాకు చెప్పివచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోకెసిఆర్‌ ఎటువంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. రాజీనామాచేస్తామని కెసిఆర్‌, నరేంద్ర ఇప్పటికేబెదిరింపు సంకేతాలుపంపారు.

 • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
 • తారల ప్రభావం నిల్‌!
 • ఉద్వేగ అంశాలు
 • తారల ప్రభావం నిల్‌!
 • ఇప్పటికిప్పుడు చెరిసగం
 • పార్టీ టికెట్ల మార్కెటింగు
 • చిరంజీవి రహస్య ఎజెండా?
 • అస్పష్ట రాజకీయ చిత్రం
 • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
 • పార్టీ టికెట్ల మార్కెటింగు
 • చిరంజీవి రహస్య ఎజెండా?
 • అస్పష్ట రాజకీయ చిత్రం
 • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X