సచిన్‌ఒక్కడేనా: అజర్
హైదరాబాద్:భారత జట్టు కేవలం సచిన్ టెండూల్కర్‌మీదనే ఆధారపడడం సరి కాదని మాజీభారత క్రికెట్ జట్టు కెప్టెన్,హైదరాబాదీ క్రీడాకారుడు మహ్మద్‌అజరుద్దీన్ అంటున్నారు. సచిన్ కీలకమైనఆటగాడేనని, అయితే మొత్తం సచిన్‌మీదనే ఆధారపడటం మంచిది కాదనిఆయన అన్నారు. భారత్‌లో ఎందరోయువ క్రీడాకారులు ఉన్నారని,ప్రతిభావంతులున్నారని, వారినిప్రోత్సహించాలని ఆయనఅభిప్రాయపడ్డారు.
పాక్‌ఫాస్ట్ బౌలర్ అక్తర్ ప్రభావం పెద్దగాఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్ అయితేజయాపజయాలను ప్రభావితం చేయగలడని,అక్తర్‌లో ఆ కన్సిస్టెన్సీ లేదని అజర్ అన్నారు.షోయబ్ అక్తర్ భారత్ వచ్చినా,రాకున్నా పడే తేడా పెద్దగా ఉండదనిఆయన అన్నారు. భారత్‌తో పాక్ జట్టు తలపడనున్ననేపథ్యంలో అజర్ తన అభిప్రాయాలనువెల్లడించారు.
పాక్‌బ్యాటింగ్‌లో భారత్‌తో పోలిస్తే వీక్‌గాఉందని, భారత బ్యాటింగ్ లైనప్‌పటిష్టంగా ఉందని, భారత్‌కువిజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని,అయితే పాక్‌ను తక్కువగా అంచనావేయడానికి వీల్లేదని, భారత్‌లో సిరీస్‌జరగడం కూడా భారత్‌కు అనుకూలమనిఆయన అన్నారు.
పాక్‌పర్యటనకు తాము వెళ్లినప్పుడు ఆదేశీయులు మన జట్టును ఎంతో ఆదరించారని,పాక్ జట్టును కూడా భారతీయులు అదేవిధంగా ఆదరించవలసిన అవసరంఉన్నదని ఆయన అన్నారు.
మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కుదూరమైన అజర్ తరుచుగా చారిటీమ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నారు. వ్యాఖ్యాతగాకూడా వ్యవహరిస్తున్నారు. వ్యాఖ్యాతగాకూడా అజర్‌కు బ్రేక్ వేయాలని చూడడంపైఐసిసిపై అజర్ ఇటీవల తీవ్రంగామండిపడ్డారు.












Click it and Unblock the Notifications
