వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకుకేంద్ర రక్షణ!

By Staff
|
Google Oneindia TeluguNews
Chandrababu Naiduహైదరాబాద్‌:తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి తన భద్రతపైసందేహాలు మొదలయ్యాయి. టిడిపిఎమ్మెల్యేను హత్య చేసినప్పుడుఒకరు మినహా గన్‌మన్లు ప్రేక్షకపాత్ర వహించడంతో చంద్రబాబు నాయుడికి రాష్ట పోలీసులపైనమ్మకం పోయినట్టు చెబుతున్నారు. తనవ్యక్తిగత భద్రతపై ఆయనటిడిపి నేతలైన ఇద్దరు ఐపిఎస్‌అధికారులు విజయరామారావు,రావులపాటి సీతారామారావులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వానికిచెందిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జి) రక్షణ కోరాలని ఆయననిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరుమాజీ ఐపిఎస్‌ అధికారులు చంద్రబాబు భద్రతపై రాష్ట్రపోలీసుఉన్నతాధికారులతో చర్చించారు. సిఎంకంటే ఎక్కువ భద్రత చంద్రబాబు నాయుడికికల్పిస్తున్నామని, అవసమనుకుంటే భద్రతాసిబందిసంఖ్యను పెంచుతామని పోలీసుఉన్నతాధికారులు వారికి హామీ ఇచ్చినట్టుతెలిసింది.

అలిపిరిలోనక్సలైట్ల మందుపాతరలోగాయపడిన అనంతరం చంద్రబాబు నాయుడికి ఎస్పీజీ లేదా ఎన్‌ఎస్‌జిరక్షణ కల్పించడానికి అప్పటి ఎన్డీయేప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకువచ్చింది. కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు అప్పట్లో కేంద్ర రక్షణవద్దనుకున్నారు. ఇప్పుడు నక్సలైట్లనుంచే గాక రాయలసీమముఠా నాయకుల నుంచి కూడా చంద్రబాబుకుప్రాణహాని కలిగేఅవకాశమున్నందున, రాష్ట్ర భద్రతా సిబ్బందిపై ఆయనఆధారపడకూడదన్న అభిప్రాయంబలపడుతోంది.

రాష్ట్రప్రభుత్వం ఇప్పుడాయనకు మూడువలయాలుగా రక్షణ కల్పిస్తోంది.మొదటి వలయంలో ఇంటిలిజెన్స్‌ పోలీసులు ఉంటారు. రెండోవలయంలో గ్రేహోండ్స్‌ పోలీసులు, మూడోవలయంలో స్ధానిక పోలీసులు ఉంటారు. ఆరు కార్లకాన్వాయ్‌లో ఆయన ప్రయాణిస్తున్నారు.అందులో ఒక కారుకు రిమోట్‌ కంట్రోల్‌జామర్‌ ఉంది. ఇప్పటికీగ్రేహోండ్స్‌రక్షణ గల ఇద్దరు ప్రతిపక్ష నాయకులుచంద్రబాబు నాయుడు, దేవేందర్‌ గౌడ్‌.చంద్రబాబు నాయుడికి మరింత భద్రతకల్పించగలమని రాష్ట్ర పోలీసులు హామీఇచ్చినప్పటికీ ఎన్‌ ఎస్‌జి రక్షణ కోసంకేంద్ర హోంశాఖను సంప్రదించాలనివిజయరామారావు, సీతారామారావు భావిస్తున్నారు.

ఇటీవలికథనాలు

  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X