బాబుకుశిరోభారం

పిల్లిగుడ్డిదైతే ఎలుక ఏదో చూపివెక్కిరించినట్టుగా ఉంది ప్రస్తుతంతెలుగుదేశం పార్టీ అంతర్గతపరిస్ధితి. 1989లో ఎన్టీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడుకూడా పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం కొంతకన్పించినప్పటికీ ఇంత అధ్వాన్నంకాదు. తన కులానికే చెందిన టిడిపి నాయకులే తనపైదాడి చేయడం చంద్రబాబు నాయుడికి ఎక్కువబాధ కలిగిస్తోంది.తమ్ముల, కోడెల ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేయగా వెనుకబడినతరగతులకు చెందిన ఎర్రన్నాయుడు, యనమలరామకృష్ణుడు, చింతకాయలఅయ్యన్నపాత్రుడు చంద్రబాబు నాయుడినివెనకేసుకు రావడం మరో విశేషం.
ఈగడ్డుకాలంలో టిడిపి నడిపించడం చంద్రబాబునాయుడికి కత్తి మీద సామువంటిదే. అయితే ఈ సమయంలో పార్టీ నాయకులుచేసిన విమర్శలను పెద్ద మనసుతో వినడం మినహావారినివదులుకునే సాహసం చంద్రబాబు నాయుడుచేసే అవకాశం లేదు. విమర్శలు చేస్తున్న వారికి ఆయనబలహీనత బాగా తెలుసు. పార్టీఅంతర్గత విషయాలను బహిర్గతం చేసేనాయకులను ఉపేక్షించబోమని చంద్రబాబునాయుడు మేకపోతుగాంభీర్యం ప్రదర్శించినా వచ్చే రెండుమూడేళ్ళు పార్టీని నడపడంలో ఆయనఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.జిల్లా స్ధాయి టిడిపి నాయకులు పార్టీలోనితమ ప్రత్యర్ధులను దెబ్బకొట్టడానికి ఈసమయంలోనే గట్టిగా ప్రయత్నిస్తారు.
ఇటీవలికథనాలు
- మాస్టర్ ప్లాన్!
- చక్రబంధంలో చంద్రబాబు
- చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
- పరిటాల రాజకీయ వైరాగ్యం
- మా తెలుగు బాబుకు చాడీల దండ!
- ఇక బాబు రోడ్‌షోలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!