బాపు యానిమేషన్ చిత్రంపైఆసక్తి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 24-11-2005
హైదరాబాద్:ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడుబాపు రూపొందిస్తున్న శ్రీకృష్ణ చరితంయానిమేషన్ సినిమాపై ఆసక్తిపెరుగుతోంది. ఈటీవీలో బాపు దర్శకత్వంలోభాగవతంసీరియల్ మంచి హిట్ అయింది. ఆమేనేజ్‌మెంట్‌తో స్పర్ధల కారణంగాబాపు ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ సంస్ధ కలర్ చిప్స్‌శ్రీకృష్ణ చరితం యానిమేషన్ చిత్రాన్నిభారీ వ్యయంతో నిర్మిస్తోంది.
సహారావన్, పర్సెప్ట్ సంస్ధలు ఇటీవల నిర్మించివిడుదల చేసిన హనుమాన్ యానిమేషన్ చిత్రం విశేష ఆదరణపొందుతోంది. సాధారణంగా 2డి యానిమేషన్‌లో 12, 13 రంగులుఉపయోగిస్తారు. హనుమాన్ చిత్రంకోసం 17 రంగులు వాడారు. శ్రీకృష్ణ చరితంయానిమేషన్ చిత్రం కోసంవెక్టార్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్‌నుఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆర్టిస్టులు వేయాల్సిన బొమ్మల సంఖ్యనాలుగోవంతుకు తగ్గిపోతుంది. రెండు గంటలనిడివి ఉన్న యానిమేషన్ సినిమా కోసం 1,72,800బొమ్మలు వేయవలసి ఉంటుంది. వెక్టార్‌సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తే సుమారు 45 వేలబొమ్మలు వేసుకుంటే సరిపోతుంది. ఈ సినిమాను హిందీ, ఆంగ్లభాషల్లోప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనినిర్మాతలు యోచిస్తున్నారు. తెలుగుతదితర ప్రాంతీయ భాషల్లో కూడావిడుదల చేసే అవకాశముంది.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
