వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిలతోతలగోక్కుంటారా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 11-11-2005

;?

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం గౌడ, పద్మశాలి, మున్నూరుకాపు, ముదిరాజ్‌కులాలను వెనుకబడిన కులాల జాబితా నుంచి తొలగిస్తారని వచ్చినవార్తలు నిజమయ్యే అవకాశం లేదు. ఈకులాలను ఫార్వర్డ్‌ క్యాస్ట్‌లుగా పరిగణించనున్నారనివచ్చిన వార్తలు ఆ కులాల నాయకుల్లో ఆందోళనకలిగించాయి. రాష్ట్ర జనాభాలో వెనుకబడినకులాల సంఖ్య దాదాపు అరవై శాతం ఉంటుంది.ఈ తేనెతుట్టును కదిపే సాహసాన్ని కాంగ్రెస్‌ప్రభుత్వం చేసే అవకాశం లేదు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింలకురిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి కొన్నికులాలను బిసి జాబితా నుంచి తొలగిస్తారన్నవార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలో 93కులాలుబిసి జాబితాలో ఉన్నాయి. వెనుకబడినకులాల్లో యాదవులు కోటి మంది, గౌడలుయాభై లక్షలు, పద్మశాలీలు నలభైలక్షలు,మత్స్యకారులు యాభై లక్షల మందిఉంటారని ఒక అంచనా. తెలుగుదేశం పార్టీవ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు ఈవెనుకబడిన కులాలను ఒక తాటి మీదికితెచ్చి ఘన విజయం సాధించారు. ఆయనతొలిసారిగా స్ధానిక సంస్ధల్లో బిసిలకురిజర్వేషన్లు కల్పించడంతో వీరికిసాధికారిత లభించింది. మండలాధ్యక్షులుగా ఎన్నికైనప్రతినిధులు ఎమ్మెల్యే స్ధాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీచంద్రబాబు నాయుడు హయాంలో ఈవెనుకబడిన కులాలన్నీ తెలుగుదేశంపార్టీని వ్యతిరేకించాయి. చంద్రబాబుగ్రామీణ ఆర్ధిక వ్యవస్ధను నిర్లక్ష్యం చేయడమేదీనికి కారణం.

కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసికమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌లోప్రధాన బిసి కులాలకు ప్రాతినిధ్యం లేదు. మిడిమిడినాలెడ్జి గల కమిషన్‌ సభ్యులు కొన్నికులాలను జాబితా నుంచితొలగించి, కొన్ని కొత్త కులాలను జాబితాలో చేర్చాలనిభావిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని వెనుకబడినకులాల్లో కొందరు ఆర్ధికంగా బలపడినమాట వాస్తవమే. కానీ సామాజికవెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈకులాలన్నీ ఇప్పటికీ గ్రామాల్లో సామాజికంగా వెనుకబడే ఉన్నాయి.వెనుకబడిన కులాల జాబితాలో మార్పులు చేయడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డిప్రభుత్వం సాహసం చేసే అవకాశంలేదు. ఒక వేళ అటువంటి సాహసం చేస్తే ఆ ప్రభుత్వంపునాదులు బీటలు వారినట్టే.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X