వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో కులరాజకీయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 23-12-2005

హైదరాబాద్‌:డి.శ్రీనివాస్‌, రఘువీరారెడ్డి, బొత్ససత్యనారాయణ వంటి బిసి మంత్రులుబిసిల సంక్షేమంపై సమావేశమై చర్చ జరపడంతోముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి దిగివచ్చినట్టు కనిపిస్తోంది.బిసిలకు స్కాలర్‌షిప్‌ల నిలిపివేతనుతెలుగుదేశం ప్రముఖంగావిమర్శించడం కూడా వైఎస్‌ మెత్తబడడానికి మరో కారణంగాకనిపిస్తోంది. బిసిలకు రాజకీయంగా కొంతఅన్యాయం జరిగిన మాట వాస్తవమేననిఆయన అంగీకరించారు. వారంలో రోజుల్లో బిసిలసంక్షేమం కోసం ఒక అద్భుత పథకంప్రవేశపెట్టనున్నామని ఆయన చెప్పారు.

వైఎస్‌నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకివచ్చాక నామినేటెడ్‌ పోస్టుల్లో,ముఖ్యమైన ప్రభుత్వ పదవుల్లోఎంత మంది రెడ్లను నియమించారోవివరిస్తూ ఇటీవల ఒక కరపత్రంరాష్ట్రమంతటా షికార్లు చేస్తోంది.తెలుగుదేశం హయాంలో కమ్మవారికిఎంత ప్రాధాన్యం లభించిందో అప్పట్లో ఇలాగేకరపత్రాలు విడుదలయ్యాయి. ఈనేపధ్యంలో 93 బిసి కులాల్లో ఈ రెండు పార్టీలమీద కొంత అసంతృప్తి కలగడం ఖాయం. కానీ ఆ అసంతృప్తి చదుకున్నవారిలోనే కనిపిస్తోంది. అది కింది స్ధాయికి చేరకపోవడంతో కాంగ్రెస్‌, టిడిపిలుఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకివస్తున్నాయి. రాజకీయాల్లో కులాలకు ప్రాముఖ్యత ఏర్పడడందురదృష్టమే అయినా, అదే ఆర్డర్‌ ఆఫ్‌దిడే గా మారింది. గత ఎన్నికల ముందు ఏ నియోజకవర్గంలో ఏకులంవారు ఎంత మంది ఉన్నారో ఒక పత్రిక సిరీస్‌నుప్రచురించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పత్రికాధిపతి రాజ్యసభసభ్యుడయ్యారు.

కొద్దినెలల్లోరాజ్యసభ సభ్యుడిగా రిటైర్‌ కానున్నదాసరి నారాయణరావు, మళ్ళీ పదవిరాకపోతే రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగకులాల వారితో పెద్ద బహిరంగ సభపెట్టే యోచనలో ఉన్నారు. చిరంజీవిని ముందు పెట్టుకుని ఒక రాజకీయపార్టీపెట్టాలన్న ఆలోచన కూడా ఆయన ఉండేది. చిరంజీవి అందుకు ససేమిరా అన్నారు.రాష్ట్రంలో కుల రాజకీయాలు బీహార్‌, యుపిలాతీవ్ర రూపం దాల్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X